వైకాపా ప్రభుత్వం తమకు అండగా నిలబడుతోందని క్రైస్తవులపై విమర్శలు చేయడాన్ని.. ఒక మతంపై జరుగుతున్న దాడిగా అసోసియేటెడ్ ఇంటిగ్రేటెడ్ క్రిస్టియన్ కౌన్సిల్ వ్యవస్థాపక అధ్యక్షులు హనోక్ అభివర్ణించారు. విజయవాడలోని కొన్ని రాజకీయ పార్టీలు క్రైస్తవులపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. ఇందుకు నిరసనగా నగరంలోని ధర్నా చౌక్‌లో నిరసన తెలుపుతున్నామని తెలిపారు.
భారతదేశంలో ప్రజలందరికీ వారి మతాలను గౌరవించే స్వేచ్ఛ ఉంది. మాపై విమర్శలు చేసిన వారు తమ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. లేదంటే రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు దిగుతాం. మేము శాంతి కాముకలమే కానీ హింసను ప్రేరేపించేవాళ్లం కాదు. విగ్రహాలు ధ్వంసం గురించి క్రైస్తవులపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. దయచేసి అలాంటి అవాస్తవాలను మాపై రుద్దవద్దు. -హనోక్, అసోసియేటెడ్ ఇంటిగ్రేటెడ్ క్రిస్టియన్ కౌన్సిల్ వ్యవస్థాపక అధ్యక్షులు
ఇదీ చదవండి: