కట్టుదిట్టమైన భద్రత నడుమ దుర్గాదేవీకి తెప్పోత్సవం నిర్వహించనున్నట్లు విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమల రావు స్పష్టం చేశారు. ట్రయిల్ రన్ విజయవంతం కావటంతో ఇవాళ సాయంత్రం కృష్ణా నదిలో తెప్పోత్సవం నిర్వహించనున్నారు. హంస వాహనంపై 32 మందిని మాత్రమే అనుమతించనున్నట్లు వెల్లడించారు. హంస వాహనంపై ఎక్కే ప్రతి ఒక్కరు విధిగా లైఫ్ జాకెట్ వేసుకోవాలని ఆదేశించారు. మూలా నక్షత్రం రోజున అమలు చేసిన ట్రాఫిక్ ఆంక్షలను మళ్లీ ఇవాళ కూడా అమలుచేస్తామన్నారు. పాసులు ఉన్నవారిని మాత్రమే హంస వాహనంపైకి వెళ్లనిస్తామన్నారు. భద్రత దృష్ట్యా హంసవాహనం ఊరేగింపులో బాణాసంచా కాల్చకుండా నిబంధన విధించినట్లు తెలిపారు.
"తెప్పోత్సవానికి పటిష్ఠ ఏర్పాట్లు.. పాసు ఉంటేనే అనుమతి" - అన్ని శాఖల సమన్వయంతో అమ్మవారి తెప్పోత్సవం
విజయవాడ కనకదుర్గమ్మ దసరా ఉత్సవాల్లో భాగంగా ఇవాళ కృష్ణా నదిలో తెప్పోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఇటీవల గోదావరిలో జరిగిన బోటు ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమానికి పటిష్ఠ ఏర్పాట్లు చేసినట్లు విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు.