ETV Bharat / city

యూటీఎఫ్​ 'చలో సీఎంవో' పిలుపు.. అనుమతి లేదన్న బెజవాడ సీపీ

APUTF Chalo CMO: సీపీఎస్​ రద్దు కోరుతూ... ఏపీ యూటీఎఫ్​ 'చలో సీఎంవో' పిలుపు నేపథ్యంలో పోలీసుల అరెస్టుల పర్వం కొనసాగుతోంది. వివిధ ప్రాంతాల్లో బైక్‌ జాతాలు నిర్వహిస్తున్న యూటీఎఫ్​ నేతలను ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. ఇతర నేతలకు నోటీసులిచ్చి గృహనిర్బంధంలో ఉంచారు. సీఎంవో ముట్టడికి అనుమతి లేదన్న విజయవాడ సీపీ.. ఆంక్షలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్నారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని యూటీఎఫ్​ నేతలు స్పష్టంచేశారు.

UTF Call to Chalo CMO
'చలో సీఎంవో'కు యూటీఎఫ్‌ పిలుపు
author img

By

Published : Apr 24, 2022, 8:41 PM IST

'చలో సీఎంవో'కు యూటీఎఫ్‌ పిలుపు.. అనుమతి లేదన్న బెజవాడ సీపీ

APUTF Call to Chalo CMO: సీపీఎస్​ రద్దు చేయాలంటూ..కొంతకాలంగా ఆందోళనలు కొనసాగిస్తున్న ఏపీ యూటీఎఫ్​... సోమవారం సీఎం కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చింది. సీపీఎస్​ రద్దు పోరులో భాగంగా కొద్దిరోజులుగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నేతలు బైక్‌ ర్యాలీ చేపట్టారు. ర్యాలీల ద్వారా ఆయా ప్రాంతాల నుంచి నేతలు, ఉపాధ్యాయులు సోమవారం విజయవాడకు చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆయా జిల్లాల్లోనే యూటీఎఫ్​ బైక్‌ ర్యాలీలను నిలిపేశారు. అనేక చోట్ల ముందస్తు అరెస్టులు, నోటీసులిచ్చి గృహనిర్బంధాలు చేస్తున్నారు.

ప్రకాశం జిల్లాలో పలుచోట్ల పోలీసులు యూటీఎఫ్ నాయకుల్ని నిర్బంధించారు. కనిగిరి, పామూరు, సి. ఎస్​. పురం, పెదచెర్లోపల్లి, హనుమంతునిపాడు మండల కేంద్రాల్లోని యూటీఎఫ్ నాయకులకు పోలీసులు నోటీసులిచ్చి స్టేషన్‌కు పిలిపించారు. విజయవాడ సభకు వెళ్లొద్దని వారి నుంచి సంతకాలు తీసుకున్నారు. పోలీసుల తీరుపై యూటీఎఫ్ నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

శ్రీకాకుళం జిల్లాలో ఉపాధ్యాయులను ఎక్కడికక్కడ హౌస్‌ అరెస్ట్‌ చేశారు. యూటీఎఫ్ నాయకుల ఇంటి వద్ద పోలీసు పహారా ఏర్పాటు చేశారు. పోలీసుస్టేషన్‌కు రావాలని ఒత్తిడి చేస్తున్నారని... యూటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్‌కుమార్‌ ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు రెండు వందల మందిని నిర్బంధించినట్లు తెలిపారు.

సీఎంవో ముట్టడి కార్యక్రమానికి వెళ్లకుండా అమలాపురంలో పోలీసులు యూటీఎఫ్ నాయకుల్ని అడ్డుకున్నారు. ఎమ్మెల్సీ వెంకటేశ్వరావును గృహ నిర్బంధం చేశారు. అధిక సంఖ్యలో వచ్చిన ఉపాధ్యాయులు ఎమ్మెల్యే వెంకటేశ్వరరావును తమ వెంట తీసుకెళ్లారు. వీరిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుకు నిరసనగా..యూటీఎఫ్ నాయకులు రోడ్డుపై కూర్చొని ధర్నా చేశారు.

సత్య సాయి జిల్లా మడకశిరలోని మండల విద్యా కార్యాలయం(ఎంఆర్సీ) వద్ద ఉపాధ్యాయ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. హక్కులను కాపాడుకునేందుకు శాంతియుతంగా బైక్ ర్యాలీ చేస్తున్న తమను ప్రభుత్వం అణిచివేయడం దుర్మార్గమైన చర్య అని అనంతరం ఉపాధ్యాయ నాయకులు ధ్వజమెత్తారు. ఇప్పటికైనా ప్రభుత్వం మనసు మార్చుకొని సీపీఎస్ రద్దు చేయాలని డిమాండ్​ చేశారు.

ముట్టడించి తీరుతాం: సీపీఎస్‌ రద్దుపై సీఎం జగన్‌ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని యూటీఎఫ్‌ నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. సీఎంకు చిత్తశుద్ధి ఉంటే సీపీఎస్‌ రద్దుపై వెంటనే నిర్ణయం తీసుకోవాలన్నారు. పోలీసు ఆంక్షలు, అడ్డగింతలపై మండిపడ్డ నేతలు.. ఎన్ని ఆటంకాలు కల్పించినా సీఎంవో ముట్టడి జరిపితీరుతామని చెబుతున్నారు. 5వేల మందితో సీఎంవోకు బైక్‌ ర్యాలీ చేసి తీరుతామని స్పష్టంచేశారు. మరోవైపు సీఎంవో ముట్టడికి ఎలాంటి అనుమతులు లేవన్న విజయవాడ సీపీ కాంతిరాణా టాటా చెప్పారు. నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇద చదవండి: ప్రభుత్వ ఉపాధ్యాయులకు సెలవులు రద్దు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.