APS RTC Special buses for Sankranti : సంక్రాంతి పండుగ రద్దీ దృష్ట్యా ఆర్టీసీ పలు ప్రాంతాలకు 1,266 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. విజయవాడ నుంచి ఈ బస్సులు నడుస్తాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, రాజమహేంద్రవరం, తదితర ప్రాంతాలకూ బస్సులను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు.
ప్రత్యేక బస్సుల వివరాలు..
-> జనవరి 7 నుంచి 17 వరకు ప్రత్యేక బస్సులు నడుస్తాయి.
-> విజయవాడ నుంచి హైదరాబాద్ కు 362 బస్సులు
-> బెంగళూరు కు 14 బస్సులు, చెన్నైకి 20 బస్సులు
-> విజయవాడ నుంచి విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరానికి 390 బస్సులు
-> విజయవాడ - రాజమహేంద్ర వరం మధ్య 360 ప్రత్యేక బస్సులు
-> ఇతర ప్రాంతాలకు 120 బస్సులు ఏర్పాటు చేశారు.
ప్రత్యేక బస్సుల్లో 50 శాతం అదనపు చార్జీ వసూలు చేయనున్నట్లు తెలిపారు. ప్రత్యేక బస్సుల్లో ముందస్తుగా టికెట్ రిజర్వేషన్ చేసుకునే అవకాశం కల్పించినట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికులు ఏపీఎస్ ఆర్టీసీ ఆన్ లైన్ వెబ్ సైట్లో టికెట్లు బుక్ చేసుకోవాలని అధికారులు కోరారు.
ఇదీ చదవండి : Special Trains: సంక్రాంతి రద్దీ దృష్ట్యా.. పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు