ETV Bharat / city

AP EAPCET 2022: ఈఏపీసెట్‌ ఫలితాలు వచ్చాయ్​... ఉత్తీర్ణత ఎంతంటే?

AP EAPCET 2022: ఏపీ ఈఏపీసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడలో మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేశారు.

AP EAPCET 2022
AP EAPCET 2022
author img

By

Published : Jul 26, 2022, 11:59 AM IST

Updated : Jul 27, 2022, 7:15 AM IST

ఈఏపీసెట్‌ ఫలితాలు వచ్చాయ్​... ఉత్తీర్ణత ఎంతంటే?

AP EAPCET 2022: ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్‌ ఫలితాల్లో 90.96 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించారు. అబ్బాయిలకంటే అమ్మాయిలు ఎక్కువ మంది అర్హత సాధించారు. అబ్బాయిలు 89.35 శాతం, అమ్మాయిలు 92.61 శాతం మంది అర్హత పొందారు. విజయవాడలో మంగళవారం ఫలితాలను మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. 160 మార్కులకు నిర్వహించిన ఈ ప్రవేశ పరీక్షలో ఓసీ, బీసీ విద్యార్థులకు 25శాతం కనీస అర్హత మార్కులుగా నిర్ణయించగా.. ఎస్సీ, ఎస్టీలకు ఎలాంటి అర్హత మార్కులు లేవు. పరీక్ష రాసిన వారందరికీ ర్యాంకులిచ్చారు. ఇంజినీరింగ్‌ విభాగంలో మొదటి పది స్థానాల్లోనూ అబ్బాయిలే నిలిచారు. ఇందులో తొలి 3 స్థానాలు సాధించిన పిల్లల తల్లిదండ్రులిద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులు. 5, 6, 7 ర్యాంకులను తెలంగాణకు చెందిన విద్యార్థులు కైవసం చేసుకున్నారు. బైపీసీ స్ట్రీమ్‌లో మొదటి పది ర్యాంకుల్లో 3, 5 స్థానాల్లో అమ్మాయిలు నిలవగా.. మిగతా 8 ర్యాంకులు అబ్బాయిలకే దక్కాయి. వీరిలో తెలంగాణకు చెందిన విద్యార్థులకు 7, 8, 9 ర్యాంకులు లభించాయి. ఇంటర్మీడియట్‌ మార్కుల వెయిటేజీని ఈసారి తొలగించారు. రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగానే ర్యాంకులు కేటాయించారు.

ఇంజినీరింగ్‌ (ఎంపీసీ స్ట్రీమ్‌)లో పెరిగిన అర్హులు
* ఎంపీసీ స్ట్రీమ్‌లో అర్హత సాధించిన వారి సంఖ్య ఈసారి పెరిగింది. 1,94,752 మంది పరీక్షకు హాజరుకాగా, ఇందులో 1,73,572 మంది (89.12%) అర్హత సాధించారు. 2021-22లో 1,34,205 మంది (80.62%) అర్హత సాధించగా ఈసారి సంఖ్య 1,73,572కి పెరిగింది. అర్హత సాధించిన వారిలో అబ్బాయిలు 1,01,703, అమ్మాయిలు 71,869 మంది ఉన్నారు.

* బైపీసీ స్ట్రీమ్‌లో 87,744 మంది పరీక్ష రాయగా 83,411 మంది (95.06%) అర్హత సాధించారు. వీరిలో అబ్బాయిలు 25,771, అమ్మాయిలు 57,640 మంది ఉన్నారు. గతేడాదితో పోల్చితే బైపీసీ స్ట్రీమ్‌లో 10,923 మంది అర్హులు పెరిగారు.

జేఈఈ తర్వాతే కౌన్సెలింగ్‌
జేఈఈ మెయిన్‌, అడ్వాన్స్‌డ్‌ కౌన్సెలింగ్‌ తర్వాతే ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ఎన్‌టీఏ ఇప్పటివరకు కౌన్సెలింగ్‌ తేదీలను ప్రకటించలేదని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 258 ఇంజినీరింగ్‌ కళాశాలల్లో 1,48,283 సీట్లు ఉన్నాయని, ప్రభుత్వ కళాశాలల్లో 5,800 సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఎంపీసీ స్ట్రీమ్‌లో 1.73 లక్షల మంది అర్హత సాధించగా 1.48 లక్షల సీట్లు ఉన్నాయని తెలిపారు. 27 ఫార్మసీ కళాశాలల్లో 16,700 సీట్లకు అనుమతులు లభించాయని వెల్లడించారు. ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో కన్వీనర్‌ కోటా కింద 35 శాతం సీట్లు కేటాయిస్తామని చెప్పారు. ఉక్రెయిన్‌లో వైద్య విద్య చదువుతూ మధ్యలో ఇక్కడికి వచ్చినవారికి సీట్లను సర్దుబాటు చేసేందుకు ఇక్కడున్న విధానాలు అనుమతించాలి కదా? అని చెప్పారు. వారిపై తమకు సానుభూతి ఉందని, ప్రస్తుత విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు.

* ఇంజినీరింగ్‌ యాజమాన్య కోటాపై ప్రభుత్వ అనుమతి లభించాల్సి ఉందని ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌ హేమచంద్రారెడ్డి తెలిపారు. మొత్తం సీట్లలో 70శాతం కన్వీనర్‌ కోటా కాగా.. 30 శాతం యాజమాన్య కోటాగా ఉంటుందని, గతేడాది యాజమాన్యం 30 శాతంలో 15 శాతం ఎన్‌ఆర్‌ఐ కోటాను కళాశాలలు భర్తీ చేసుకున్నాయని వెల్లడించారు. మిగతా 15 శాతాన్ని కన్వీనర్‌ ద్వారా భర్తీ చేశామని తెలిపారు. ఈసారి 30శాతం సీట్లను కళాశాలల యాజమాన్యాలకే అప్పగించేందుకు ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపామని తెలిపారు.

అగ్రికల్చర్‌, ఫార్మసీ ర్యాంకర్ల మనోగతం

కాన్సెప్ట్‌ వారీగా సాధన చేశా..: దినేష్‌ కార్తీక్‌రెడ్డి, మొదటి ర్యాంకర్‌, పల్నాడు జిల్లా

దినేష్​ కార్తీక్​రెడ్డి
దినేష్​ కార్తీక్​రెడ్డి

మా నాన్న పెదకూరపాడు మండలం 75 త్యాళ్లూరుకు చెందిన శ్రీనివాసరెడ్డి ఆర్‌డబ్ల్యూఎస్‌ వర్క్‌ఇన్‌స్పెక్టర్‌. అమ్మ శివకుమారి గృహిణి. కొత్త కాన్సెప్ట్‌లవారీగా సాధన చేయడం వల్ల మొదటి ర్యాంకు సాధించగలిగా. రోజూ 13-14 గంటలు చదువుకునేవాణ్ని. అధ్యాపకుల గైడెన్స్‌ ఉపయోగపడింది.

.
.

వైద్యుడిగా సేవలందిస్తా..: రెండో ర్యాంకర్‌ కీర్తి తేజ

కీర్తితేజ
కీర్తితేజ

జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం మాది. ఈ ర్యాంకు సాధించినప్పటికి వైద్యుడు కావాలన్నదే నా లక్ష్యం. మా అన్నయ్య వేద సంహిత్‌ రాయ్‌పుర్‌ ఏఐఎంఎస్‌లో వైద్య విద్యార్థి. మా నాన్న పరాత్పరరావు వైఎస్సార్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం అసోసియేట్‌ ప్రొఫెసర్‌. అమ్మ నాగాంబిక ప్రైవేటు కళాశాలలో రసాయనశాస్త్ర అధ్యాపకురాలు.

అక్క స్ఫూర్తితోనే... : 3వ ర్యాంకర్‌ ఆసు హిందు

ఆసు హిందు
ఆసు హిందు

మాది పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ. మా నాన్న విజ్జేశ్వరరావు చిరువ్యాపారి. అమ్మ భారతి గాయత్రి గృహిణి. మా అక్క సత్య ఎంబీబీఎస్‌ రెండో సంవత్సరం చదువుతోంది. ఆమె స్ఫూర్తితోనే చదువుతున్నా. నేనూ ఎంబీబీఎస్‌ సాధిస్తా. నీట్‌లో మంచి ర్యాంకు వస్తుంది.

ఇంజినీరింగ్‌ ర్యాంకర్ల లక్ష్యాలివి...

ఐఐటీ కంప్యూటర్‌ సైన్స్‌ సాధిస్తా: మొదటి ర్యాంకరు డి.హరేన్‌ సాత్విక్‌, హిందూపురం, శ్రీసత్యసాయి జిల్లా

హరేన్​ సాత్విక్​
హరేన్​ సాత్విక్​

ప్రతిష్ఠాత్మక ఐఐటీ విద్యాలయంలో కంప్యూటర్‌ సైన్సులో సీటు సాధించడమే లక్ష్యం. మా నాన్న ఉన్నత పాఠశాల వ్యాయామ సంచాలకులు బీఏ లోక్‌నాథ్‌, అమ్మ.. ఇక్కడే ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్న పద్మజతోపాటు అధ్యాపకులు నాకు మార్గనిర్దేశం చేశారు.ఇంటర్మీడియట్‌ కర్ణాటకలో చదివా.

.
.

ముంబయి ఐఐటీలో కంప్యూటర్‌ సైన్స్‌ లక్ష్యం: రెండో ర్యాంకర్‌ లక్ష్మీసాయి లోహిత్‌రెడ్డి, ఒంగోలు నగరం

లోహిత్​రెడ్డి
లోహిత్​రెడ్డి

మా నాన్న మాల్యాద్రిరెడ్డి దర్శి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో, అమ్మ లక్ష్మీకాంత తూర్పుగంగవరం ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు. ఇంటర్మీడియట్‌ హైదరాబాద్‌లో చదివా. జేఈఈలో మంచి మార్కులు సాధించి ముంబయి ఐఐటీలో కంప్యూటర్‌ సైన్స్‌ చేయాలన్నది లక్ష్యం.

సాఫ్ట్‌వేర్‌ రంగంలో స్థిరపడతా..: మూడో ర్యాంకర్‌ హిమవంశీ, శ్రీకాకుళం

హిమవంశీ
హిమవంశీ

మా అమ్మానాన్నలు రవిశంకర్‌, స్వరాజ్యలక్ష్మి ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులు. ముంబయి ఐఐటీలో కంప్యూటర్‌ సైన్స్‌ సాధిస్తా. భవిష్యత్తులో సాఫ్ట్‌వేర్‌ రంగంలో స్థిరపడాలనేదే నా లక్ష్యం. రోజూ ప్రణాళికాబద్ధంగా చదవడం, ఆబ్జెక్టివ్‌ స్కిల్‌ పెంచుకోవడంవల్ల ఈ ర్యాంకు వచ్చింది.

.
.
.
.

ఫలితాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి

ఈసారి ఇంజినీరింగ్, అగ్రి, ఫార్మా ప్రవేశాలకు ఇంటర్ మార్కుల వెయిటేజ్ లేదు. ర్యాంకుల ఆధారంగానే ప్రవేశాలు జరుగుతాయి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు మార్కులు, ర్యాంకులతో సంబంధం లేకుండా ప్రవేశాలు. ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో మేనేజ్‌మెంట్ కోటా 35శాతం సీట్లు ఈసారి ప్రభుత్వమే భర్తీ చేస్తుంది.

- బొత్స సత్యనారాయణ, విద్యాశాఖ మంత్రి

ఇవీ చదవండి:

Last Updated : Jul 27, 2022, 7:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.