ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్ కో-ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్‌కు చెందిన నిరర్ధక, ఉపయోగించని ఆస్తులను అమూల్‌కు లీజుకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కమిటీల సిఫార్సుల మేరకు నామమాత్రపు లీజుకు వీటిని అప్పగించాలని ఆదేశాల్లో పేర్కొంది.
రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని పాడి సహకార సంస్థల పునరుజ్జీవనం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. లీజుకు సంబంధించిన చర్యలను వెంటనే తీసుకోవాలని ఎపీడీడీసీఎఫ్, మేనేజింగ్ డైరెక్టర్‌ను ఆదేశించింది.
ఇదీ చదవండి: