ETV Bharat / city

సీఎం జగన్‌ మానసిక పరిస్థితి అర్థం కావడంలేదు: శైలజానాథ్ - Sailajanath fire on CM jagan

Sailajanath On Three Capitals: శాసనసభలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మూడు రాజధానులపై మూర్ఖంగా మాట్లాడడం తగదని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజనాథ్ అన్నారు. న్యాయ వ్యవస్థకు కూడా గౌరవం ఇవ్వని ముఖ్యమంత్రిని చూస్తున్నామని మండిపడ్డారు.

Sailajanath
Sailajanath
author img

By

Published : Mar 25, 2022, 11:58 AM IST

Updated : Mar 26, 2022, 4:49 AM IST

Sailajanath On Three Capitals: శాసనసభలో ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానులపై మూర్ఖంగా మాట్లాడడం తగదని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజనాథ్ అన్నారు. న్యాయ వ్యవస్థకు కూడా సీఎం గౌరవం ఇవ్వడం లేదని మండిపడ్డారు. రాజధానిపై హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చాక కూడా.. ఇంకా పరిపాలనా వికేంద్రీకరణ గురించి మాట్లాడటం సీఎం జగన్ రెడ్డి అహంకారానికి నిదర్శనమని విమర్శించారు.

చట్టంలో రాజధాని ఒకటే ఉందని హైకోర్టు చెప్పాక మళ్లీ పరిపాలన వికేంద్రీకరణ, మూడు రాజధానులపై మాట్లాడటమేంటని ప్రశ్నించారు. గతంలో ఎందుకు అమరావతిని రాజధానిగా అంగీకరించారో, ఇప్పుడు ఎందుకు వ్యతిరేస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మూడు రాజధానులు అనేది అశాస్త్రీయమన్న విషయాన్ని ఇప్పటికైనా జగన్ తెలుసుకోవాలని శైలజనాథ్ సూచించారు.

ఇదీ చదవండి : Oppositions: "వికేంద్రీకరణతో.. విద్వేష రాజకీయాలు చేస్తున్నారు"

Last Updated : Mar 26, 2022, 4:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.