రాష్ట్రవ్యాప్తంగా 8,270 కిలోమీటర్ల మేర దెబ్బతిన్న రహదారులు
విశాఖకు చెందిన అంధ విద్యార్థినికి ప్రధాని మోదీ ప్రశంస
విశాఖలోని సాగర్‌నగర్ సమీప ప్రభుత్వ అంధ బాలికల ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థిని ఎస్.మాధురిని ప్రధాని మోదీ ప్రశంసించినట్లు ప్రిన్సిపల్ ఎం.మహేశ్వరరెడ్డి వెల్లడించారు. జాతీయ జెండా విశిష్టతను వర్ణిస్తూ చేసిన ప్రసంగానికి ప్రధానమంత్రి మోదీ ట్విటర్ ద్వారా అభినందనలు తెలిపారన్నారు.
ఉపాధ్యాయుల ముఖ ఆధారిత హాజరుపై అంతర్గత పోరు
ప్రభుత్వ ఉపాధ్యాయులకు నేటి నుంచి యాప్ ఆధారిత హాజరును విద్యాశాఖ అమలుచేస్తోంది. ఉదయం 9 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా సగం రోజు సెలవుగా పరిగణిస్తామని స్పష్టం చేస్తోంది. అయితే దీన్ని ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవద్దని పిలుపునివ్వడంతో ఉపాధ్యాయ సంఘాలు, విద్యాశాఖ అధికారుల మధ్య అంతర్గత పోరుకు దారితీస్తోంది.
సీఎం జగన్ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ప్రసంగంలో అడుగడుగునా తడబాటు
స్వేద్యం, ఆర్థిక స్వాలంబన, అభ్యుద్వయం, ఉటకించారు, సామాజిక అభ్రదత, మహానుయోధులు, వజ్జోత్సవాలు ఈ పదాలను చదువుతుంటే... ఏంటీ ? అన్నీ తప్పులతడకగా ఉన్నాయే ! అని అనిపిస్తోందా? స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సీఎం జగన్ ప్రసంగంలో దొర్లిన పొరపాట్లలో ఇవి కొన్ని మాత్రమే.
డీఎన్‌ఏ పరీక్షలతో నేతాజీ మరణం మిస్టరీని ఛేదించండి
జపాన్ రాజధాని టోక్యోలోని రెంకోజీ ఆలయంలో ఉంచిన నేతాజీ అస్థికలకు డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు ఆయన కుమార్తె అనితా బోస్. మృతిపై ఇప్పటికీ కొందరికి ఉన్న అనుమానాలకు డీఎన్‌ఏ పరీక్ష సమాధానాలు ఇస్తుందన్నారు.
మరో ఆరు నెలల్లో ఒమిక్రాన్‌ను ఎదుర్కొనే టీకా
వచ్చే ఆరు నెలల్లోపే ఒమిక్రాన్ వేరియంట్‌ను నిరోధించే వ్యాక్సిన్ తీసుకురానున్నట్లు సీరం ఇన్స్టిట్యూట్ సీఈఓ అదర్ పూనావాలా ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశంలోని పలు ప్రాంతాల్లో కరోనా కేసుల సంఖ్య పెరగడానికి ఒమిక్రాన్ వేరియంట్ కారణమని నివేదికలు వస్తోన్న వేళ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఆ దేశాల సంగతి చూద్దాం అంటూ పుతిన్, కిమ్ ప్రేమ లేఖలు
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ పరస్పరం లేఖలు రాసుకున్నారు. శత్రు దేశాల బెదిరింపులు, రెచ్చగొట్టే చర్యలను ఉమ్మడిగా ఎదుర్కొందామని తీర్మానించారు.
త్వరలోనే మహీంద్రా ఎలక్ట్రిక్ ఎస్యూవీ, వరుసగా 4 మోడల్స్
మహీంద్రా విద్యుత్ ఎస్యూవీ సిరీస్‌లో తొలి వాహనం 2024 ఆఖరుకు విడుదలవుతుందని వెల్లడించారు ఆ సంస్థ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా. మొత్తంమీద 2024-26 సంవత్సరాలలో 4 విద్యుత్తు ఎస్‌యూవీలు రోడ్లపైకి రావొచ్చని తెలిపారు.
రవితేజ సినిమా నుంచి జింతాక్ పాట, ఏప్రిల్‌లో టైగర్ 3
మాస్ మహారాజ రవితేజ హీరోగా తెరకెక్కుతున్న ధమాకా చిత్రం నుంచి కొత్త పాటను విడుదల చేయనున్నారు. జింతాక్ అంటూ సాగే ఈ సినిమాలోని పాటను ఈ నెల 18న విడుదల చేయనున్నట్టు చిత్రవర్గాలు తెలిపాయి. మరోవైపు, సల్మాన్‌ఖాన్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం టైగర్ 3. వచ్చే ఏడాది ఏప్రిల్ 21న విడుదలవుతున్నట్టు సల్మాన్ సోమవారం స్వయంగా ప్రకటించారు.
చెన్నైతో జడేజా ఇన్నింగ్స్ ముగిసినట్లే
గత ఐపీఎల్‌లో చివరి మ్యాచ్‌లకు అందుబాటులో లేని జడేజా.. సామాజిక మాధ్యమాల్లో గతంలో చెన్నై జట్టు గురించి చేసిన పోస్టులను తొలగించాడు. దీంతో సీఎస్కేకు అతడు దూరం అవుతున్నాడన్న ఊహాగానాలు వినిపించాయి. ఆటగాళ్ల మధ్య బంధాన్ని దృఢపరచడానికి సీఎస్కే నిర్వహించే కార్యక్రమాలకు కూడా హాజరు కాకపోవడం జడేజా జట్టును వీడనున్నాడన్న వార్తలకు బలాన్ని అందిస్తోంది.