ఫోరెన్సిక్ విభాగంలో 58 సైంటిఫిక్ అసిస్టెంట్ల పోస్టులను భర్తీ చేయడానికి ఏపీ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 58 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఫోరెన్సిక్ సైన్స్‌లో ఫిజిక్స్, కెమికల్ & బయాలజీ/సెరాలజీ, ప్రయోగశాలకు సంబంధించిన ఖాళీలను ప్రభుత్వం భర్తీ చేయనుంది.
సైంటిఫిక్ అసిస్టెంట్ ఫిజిక్స్-18, సైంటిఫిక్ అసిస్టెంట్ కెమికల్-17, సైంటిఫిక్ అసిస్టెంట్ బయాలజీ /సెరాలజీలో 22, పోస్టులు ఖాళీగా ఉన్నాయని బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. అభ్యర్థులకు ఈనెల 2 నుంచి 22వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్ లో దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపింది. మరిన్ని వివరాల కోసం slprb.ap.gov.in సంప్రదించవచ్చని అభ్యర్ధులకు సూచించింది.
ఇదీచదవండి