ETV Bharat / city

క్రమబద్ధీకరణ కోరుతూ ఒప్పంద ఉద్యోగుల నిరాహార దీక్ష

author img

By

Published : Nov 5, 2020, 4:12 PM IST

ప్రజా సంకల్ప యాత్రలో జగన్ ఇచ్చిన హామీని నెరవేర్చాలంటూ.. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ఒప్పంద సిబ్బంది నిరాహారదీక్షకు దిగారు. తమను వెంటనే క్రమబద్ధీకరించాలని విజయవాడలో డిమాండ్ చేశారు. సాధారణ ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా పదవీ విరమణ అనంతరం సౌకర్యాలు వర్తింప చేయాలని నినాదాలు చేశారు.

medical contract employees hunger strike
నిరాహారదీక్షకు దిగిన ఒప్పంద సిబ్బంది

కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తానన్న సీఎం జగన్ హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ.. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ఒప్పంద సిబ్బంది.. నిరాహార దీక్షకు దిగారు. రాష్ట్ర వ్యాప్త కాంట్రాక్టు ఉద్యోగుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో.. విజయవాడ ధర్నాచౌక్​ వద్ద ఆందోళన నిర్వహించారు.

సీఎం కాకముందు చేసిన ప్రజా సంకల్ప యాత్రలో.. జగన్ మాటిచ్చారని గుర్తు చేశారు. అర్హత కలిగిన హెల్త్ అసిస్టెంట్, ల్యాబ్ టెక్నీషియన్, ఏఎన్ఎం, స్టాఫ్ నర్స్​లను తక్షణమే క్రమబద్దీకరించాలని నినాదాలు చేశారు. 20 ఏళ్లుగా పని చేస్తూ.. వయసు మీద పడిన 60 శాతం మందికి పదవీ విరమణానంతర సౌకర్యాలు కల్పించాలన్నారు.

ఇదీ చదవండి:

అధికార పార్టీ అక్రమాలను ప్రశ్నిస్తే తప్పుడు కేసులా?: దేవినేని

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.