ETV Bharat / city

రాష్ట్రంలో కరోనా కల్లోలం..కొత్తగా 17,354 కేసులు, 64 మరణాలు

ap corona cases
రాష్ట్రంలో కరోనా కల్లోలం
author img

By

Published : Apr 30, 2021, 6:46 PM IST

Updated : Apr 30, 2021, 7:23 PM IST

18:43 April 30

ఏపీలో కరోనా కేసులు

ap corona cases
కరోనా హెల్త్ బులిటెన్

రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కొవిడ్‌ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 86,494 పరీక్షలు నిర్వహించారు. కొత్తగా 17,354 కేసులు నిర్ధరణ కాగా.. 64 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. 24 గంటల వ్యవధిలో 8,468 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,22,980 కరోనా క్రియాశీల కేసులు ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది.  

జిల్లాల వారీగా కేసులు

గడచిన 24 గంటల్లో చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 2,764 కరోనా కేసులు నమోదయ్యాయి. గుంటూరు 2,129, అనంతపురం 1,862, తూర్పు గోదావరి 1,842, శ్రీకాకుళం 1,581, విశాఖ 1,358, నెల్లూరు 1,133, కర్నూలు 967, పశ్చిమగోదావరి 842, కడప 757, విజయనగరం 740, కృష్ణా 698, ప్రకాశం 661 చొప్పున కేసులు నమోదయ్యాయి.  

జిల్లాల వారీగా మరణాలు  

గత 24 గంటల వ్యవధిలో నెల్లూరు, విశాఖ జిల్లాలో అత్యధికంగా 8 మంది చొప్పున వైరస్ బారిన పడి మృతి చెందారు. విజయనగరం 7,  చిత్తూరు 6, తూర్పుగోదావరి 6, అనంతపురం 5, గుంటూరు 4, కర్నూలు 4, పశ్చిమగోదావరి 4, కృష్ణా 3, శ్రీకాకుళం 3 చొప్పున వైరస్ కారణంగా ప్రాణాలు విడిచారు.  

ఇదీచదవండి: కొవిడ్​-19 రోగులను చేర్చుకోవడం ఆపేశాం..!

Last Updated : Apr 30, 2021, 7:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.