అటవీ శాఖలో కంపా నిధుల వినియోగంపై హైకోర్టులో విచారణ శుక్రవారానికి వాయిదా పడింది. ప్రభుత్వం తరపున వాదనలు వినేందుకు అవకాశమిస్తూ న్యాయస్థానం విచారణను వాయిదా వేసింది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన కంపా నిధులు సక్రమంగా వినియోగించలేదని.., ఈ నిధుల్నిరాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించిందంటూ గుంటూరుకు చెందిన తోట సురేష్‌బాబు ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. కంపా నిధులను అడవుల అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ కోసం వినియోగించాల్సి ఉండగా...వందల కోట్ల రూపాయలను ప్రభుత్వం ఇతర పథకాలకు కేటాయిస్తోందంటూ పిటిషనర్ తరపున న్యాయవాది నర్రా శ్రీనివాస్ వాదనలు వినిపించారు.
ఇదీచదవండి