ETV Bharat / city

Inside Trading: రాజధాని భూములపై ఏసీబీ కేసు కొట్టివేత - దమ్మాలపాటి ఇన్​సైడ్ ట్రేడింగ్ కేసులు కొట్టివేత

మాజీ అడ్వకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌, తదితరులపై అవినీతి నిరోధక చట్టం, ఇన్‌సైడర్ ట్రేడింగ్ కింద నమోదైన కేసులను హైకోర్టు కొట్టేసింది. దమ్మాలపాటితో పాటు తదితరులపై చేసిన ఆరోపణలు నిరాధారమని..ఎక్కడా రుజువులు లేవని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఆయనపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

మాజీ ఏజీ దమ్మాలపాటికి ఊరట
మాజీ ఏజీ దమ్మాలపాటికి ఊరట
author img

By

Published : Sep 2, 2021, 7:02 PM IST

Updated : Sep 3, 2021, 8:38 AM IST

రాజధాని భూముల కొనుగోలుకు సంబంధించి గతేడాది సెప్టెంబరు 15న మాజీ అదనపు అడ్వకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌, మరి కొందరిపై అవినీతి నిరోధకశాఖ (అనిశా) నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సీహెచ్‌ మానవేంద్రనాథ్‌ రాయ్‌ గురువారం కీలక తీర్పు ఇచ్చారు. ‘ప్రైవేటు వ్యక్తుల మధ్య ఆరేళ్ల కిందట జరిగిన భూముల క్రయవిక్రయాలను ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు వర్తింపజేస్తూ నేరపూర్వక విషయంగా ప్రాసిక్యూషన్‌ పేర్కొంటున్న ప్రత్యేకమైన కేసుగా ఇది కనపడుతోంది. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ భావన పబ్లిక్‌ కంపెనీల స్టాక్స్‌కు సంబంధించింది. ఇది భూముల క్రయవిక్రయాలకు సంబంధం లేని విషయం. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు కళ్లెం వేసేందుకు తెచ్చిన సెబి చట్ట నిబంధనలను ఐపీసీ సెక్షన్లకు వర్తింపజేయడానికి వీల్లేదు. భూముల ప్రైవేటు క్రయవిక్రయాలు చేసినవారిని నేరం చేశారనడానికి వీల్లేదు.

అమరావతిలో భూముల కొనుగోలు వ్యవహారం ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ కాదని హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ఖరారుచేసింది’ అని జస్టిస్‌ మానవేంద్రనాథ్‌ రాయ్‌ తీర్పులో స్పష్టం చేశారు. తనపై నిరర్ధకమైన ఫిర్యాదు చేసి, మానసిక వేదనకు గురి చేసినందుకు పరిహారం చెల్లించేలా ఆదేశించాలని దమ్మాలపాటి శ్రీనివాస్‌ వ్యాజ్యంలో కోరారని, ప్రస్తుత పిటిషన్లో పరిహారం ఇచ్చేలా ఆదేశించడానికి బదులుగా ఫిర్యాదుదారు కోమట్ల శ్రీనివాస స్వామిరెడ్డిపై తగిన ఫోరాన్ని ఆశ్రయించి పరిహారం కోరే విషయాన్ని దమ్మాలపాటి శ్రీనివాస్‌కు వదిలేస్తున్నట్లు న్యాయమూర్తి చెప్పారు.

నేరపూర్వక దుష్ప్రవర్తనకు తావులేదు

ప్రాసిక్యూషన్‌ వాదన ప్రకారం దమ్మాలపాటి శ్రీనివాస్‌ అదనపు ఏజీగా 2014 జూన్‌ 30 నుంచి 2016 మే 28 వరకు పనిచేశారు. రాజధాని నగర ఏర్పాటుపై 2014 జూన్‌-డిసెంబరు మధ్య ప్రభుత్వం చర్చించే సమయంలో ఆయన అదనపు ఏజీ మాత్రమే. విధానపరమైన నిర్ణయాల్లో ఏజీకి చట్టబద్ధ, రాజ్యాంగబద్ధ విధులు నిర్వహించే వీలుంటుంది. ఆ విధుల్లో జోక్యానికి అదనపు ఏజీగా దమ్మాలపాటి శ్రీనివాస్‌కు తావుండదు. ఈ నేపథ్యంలో రాజధాని నగర ప్రాంతం గురించి అదనపు ఏజీగా దమ్మాలపాటి శ్రీనివాస్‌కు సమాచారం తెలిసే అవకాశం లేదు. అనిశా ఎఫ్‌ఐఆర్‌, ప్రాథమిక నివేదికలో సైతం దమ్మాలపాటి శ్రీనివాస్‌.. రాజధానికి సంబంధించిన ఆంతరంగిక సమాచారం కలిగి ఉన్నారనలేదు. అప్పటి ముఖ్యమంత్రితో సాన్నిహిత్యం కారణంగా రాజధాని ఎక్కడ ఏర్పాటు కానుందో శ్రీనివాస్‌కు తెలుసని ప్రాసిక్యూషన్‌ చేస్తున్న వాదనను ఆమోదించలేం. రాజకీయ నాయకులతో ప్రజలు, న్యాయవాదులు సాన్నిహిత్యం కలిగి ఉంటారు. రాజధాని గురించి దమ్మాలపాటి శ్రీనివాస్‌కు ప్రత్యేక సమాచారం ఉందనేది ఊహాజనితమే. అనిశా ఎఫ్‌ఐఆర్‌, ప్రాథమిక నివేదికలో సైతం.. రాజధాని నిర్ణయ ప్రక్రియ, నూతన రాజధాని ప్రాంతాన్ని గుర్తించే విషయంలో దమ్మాలపాటి శ్రీనివాస్‌ పాత్ర ఉందని పేర్కొనలేదు. అలాంటప్పుడు బంధువులకు, కుటుంబసభ్యులకు చెప్పి భూములు కొనుగోలు చేశారనే ప్రశ్నే ఉత్పన్నం కాదు.

రాజధాని ఎక్కడనేది ప్రజా బాహుళ్యంలో ఉంది

రాజధాని నగర ప్రాంతం కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కృష్ణా నది పక్కన ఉంటుందనే అంశం గోప్యమైంది కాదు. ఆ విషయం ప్రజా బాహుళ్యంలో ఉంది. అనిశా నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌, ప్రాథమిక దర్యాప్తులో 2014 జూన్‌- డిసెంబరు మధ్య రాజధాని ప్రాంతం గురించి ప్రజల్లో ఊహలు ఉన్నాయన్నారు. కృష్ణానది పక్కన రాజధాని ఏర్పాటు చేయబోతున్నారని పత్రికల్లో ప్రచురించిన కథనాలను పిటిషనర్లు కోర్టు దృష్టికి తెచ్చారు. 2014 జూన్‌ 9న అప్పటి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయగానే.. కృష్ణా నది పక్కన రాజధాని నగరం వస్తుందని బహిరంగంగా చెప్పారు. ఆ వార్తలను పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి. కృష్ణానది పక్కన రాజధాని అని ప్రపంచం మొత్తానికి తెలుసు.

ఆస్తి సంపాదన రాజ్యాంగ, చట్టబద్ధ హక్కు

ఆస్తిని సంపాదించుకోవడం రాజ్యాంగ, చట్టబద్ధమైన హక్కు. అధికరణ 19(1)(ఎఫ్‌) భారత ప్రజలు ఆస్తిని ఆర్జించుకునే హక్కును కల్పిస్తోంది. ఆస్తిని కలిగి ఉండటం ప్రాథమిక హక్కులో భాగం. పిటిషనర్లకు భూములను అమ్మేందుకు విక్రయదారులే ముందుకొచ్చారు. ప్రైవేటు వ్యక్తుల నుంచి భూములు కొంటే, అది నేరమని ప్రాసిక్యూషన్‌ పేర్కొనడం సమర్థనీయం కాదు. పిటిషనర్లకు భూముల్ని విక్రయించిన యజమానులు అభ్యంతరం తెలపలేదు. ఎవరికీ ఫిర్యాదు చేయలేదు. ఇప్పటివరకూ ఎలాంటి క్రిమినల్‌, సివిల్‌ చర్యలు ప్రారంభించలేదు. విక్రయ ప్రక్రియకు సంబంధం లేని కొత్త వ్యక్తి ఐదేళ్ల తర్వాత అనిశాకు ఫిర్యాదు చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆ ఫిర్యాదు ఆధారంగా ప్రాథమిక విచారణ జరిపిన అనిశా డీఎస్పీ ఈ వ్యవహారాన్ని కాగ్నిజబుల్‌ నేరంగా ఎలా అభిప్రాయపడ్డారో న్యాయస్థానం ఊహకే అందడం లేదు. తమను వేధించేందుకు కొంతమంది స్వార్థ ప్రయోజనాలతో ఫిర్యాదు చేయించారనే పిటిషనర్ల వాదనను తోసిపుచ్చలేం. పిటిషనర్లు నేరానికి పాల్పడ్డారని ఆధారాలు చూపడంలో ప్రాసిక్యూషన్‌ విఫలమైంది. ఊహాజనిత ఆరోపణలతో వ్యక్తులపై క్రిమినల్‌ దర్యాప్తు చేయడానికి వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది’ అని న్యాయమూర్తి తీర్పులో ఘాటుగా పేర్కొన్నారు.

నేపథ్యమిదే..

రాజధాని భూముల కొనుగోలు విషయంలో 2020 సెప్టెంబరు 15న అనిశా పలువురిపై కేసు నమోదు చేసింది. తన విషయంలో తొందరపాటు చర్యలు తీసుకోకుండా నిలువరించాలని, దురుద్దేశంతో అనిశా నమోదు చేసిన కేసును రద్దు చేయాలని మాజీ ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్‌ అప్పట్లో హైకోర్టును ఆశ్రయించారు. ఆ వ్యాజ్యంపై 2020 సెప్టెంబరు 15న విచారణ జరిపిన న్యాయమూర్తి.. తొందరపాటు చర్యలొద్దని ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసులో ఉన్నవారిపై విచారణ, దర్యాప్తును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. ఎఫ్‌ఐఆర్‌లో వివరాల ప్రచురణ, ప్రసారానికి వీల్లేదని గ్యాగ్‌ ఆర్డర్‌ ఇచ్చారు. ఈ ఉత్తర్వులపై రాష్ట్రప్రభుత్వం సుప్రీంకోర్టులో ఎస్సెల్పీ వేసింది. ఈ ఏడాది జులై 22న సుప్రీంకోర్టులో జరిగిన విచారణలో ఎస్సెల్పీని ఉపసంహరించుకోవడానికి అనుమతి ఇవ్వాలని రాష్ట్రప్రభుత్వం కోరింది. హైకోర్టులో కౌంటర్‌ వేస్తామని తెలపగా, అందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. నాలుగు వారాల్లో విచారణను పూర్తిచేయాలని హైకోర్టుకు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో మాజీ ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్‌, మరికొందరు వేసిన క్వాష్‌ పిటిషన్లపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సీహెచ్‌ మానవేంద్రనాథ్‌రాయ్‌ ఇటీవల విచారణ జరిపారు. దమ్మాలపాటి శ్రీనివాస్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది సిద్దార్థ లూథ్రా, అనిశా తరఫున ఏజీ ఎస్‌.శ్రీరామ్‌, ఫిర్యాది తరఫున న్యాయవాది కైలాష్‌నాథ్‌రెడ్డి వాదనలు వినిపించారు.

ఇదీ చూడండి: pension problems in ap: ఇంట్లో రెండు పింఛన్లుంటే.. ఒక్కరికే!

Last Updated : Sep 3, 2021, 8:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.