ఈనెల 25న రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న ఇళ్ల పట్టాల పంపిణీపై అత్యవసర విచారణ జరపాలని వేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. ప్రభుత్వం ఈనెల 25న ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు సిద్ధమవుతోందని పిటిషనర్ తరపు న్యాయవాది డీఎస్ఎన్వీ. ప్రసాద్‌బాబు కోర్టుకు విన్నవించారు. 35 లక్షల మంది లబ్ధిదారులకు పట్టాలివ్వనున్నట్లు తెలిపారు. 35 లక్షల మంది లబ్ధిదారుల కుటుంబ సభ్యుల్లో..సగటున ఒక్కో కుటుంబంలో ముగ్గురు ఓటర్ల చొప్పున మొత్తం కోటి ఓటర్లు ఉంటారన్నారు.
కోటి ఓటర్లను ఏకపక్షంగా ఒకచోట నుంచి మరోచోటుకు తరలిస్తే...శాసనసభ, పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజనకు దారితీసే పరిస్థితి ఉందని వాదించారు. లబ్ధిదారుల్లో ఎక్కువ మంది బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీలకు చెందినవారని... దీంతో ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలపై ఆ ప్రభావం ఎక్కువగా పడే అవకాశం ఉందన్నారు. ప్రజలు వేరే ప్రాంతానికి తరలిపోయేలా ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందన్నారు. ఇళ్ల పట్టాల పంపిణీపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది.
ఇదీచదవండి