Teachers Transfers: ఆదర్శ పాఠశాలల్లో టీచర్ల బదిలీకి ఆమోదం తెలుపుతూ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ బదిలీ మార్గదర్శకాలు జారీ చేసింది. ఆదర్శ పాఠశాలల్లోని టీజీటీ, పీజీటీలకు సాధారణ బదిలీలు, 2021 నవంబర్ 1కి ఐదేళ్లు ఒకేచోట పనిచేసినవారు బదిలీకి అర్హులను పేర్కొంది. ఒకేచోట 2 ఏళ్లు చేసిన టీచర్లు రిక్వెస్ట్ బదిలీకి దరఖాస్తు చేయవచ్చని వెల్లడించింది. ఖాళీలు, సీనియారిటీ, సర్వీస్ పాయింట్లు, ఆరోగ్య అంశాల ఆధారంగా కౌన్సిలింగ్ నిర్వహించి బదిలీలు చేపడతామని తెలిపింది. డిసెంబర్ 31లోగా బదిలీల షెడ్యూల్ జారీ చేస్తామని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: తాగి ఊగుతూ పాఠశాలకు ప్రధానోపాధ్యాయుడు.. ఆపై..