ఎన్నికల సంఘం ప్రచురించిన తుది జాబితా ప్రకారం.. రాష్ట్రంలో 3,62,353 మంది ఓటర్లు పెరిగారు. 2020 నవంబరు 16న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేసేనాటికి రాష్ట్రంలో 4,00,79,025 మంది ఓటర్లు ఉండగా, ప్రత్యేక సమగ్ర సవరణ చేపట్టిన తర్వాత 4,25,860 మందిని కొత్తగా జాబితాలో చేర్చగా, 63,507 మందిని తొలగించారు. రాష్ట్రంలో గతంలో 45,836 పోలింగ్ కేంద్రాలు ఉండగా, ఈ సంఖ్య 45,917కు చేరింది. ఒక్కో పోలింగ్ కేంద్రం పరిధిలో గరిష్ఠంగా 1,500 మంది ఓటర్లు ఉండేలా జాబితా రూపకల్పన చేశారు.
తూర్పుగోదావరిలో ఎక్కువ ఓటర్లు
- మొత్తం ఓటర్లలో తూర్పుగోదావరి జిల్లా అత్యధిక ఓటర్లతో మొదటి స్థానంలో ఉంది. ఈ జిల్లాలో 43,10,788 మంది ఓటర్లు ఉన్నారు. తర్వాత గుంటూరు, విశాఖ, కృష్ణా జిల్లాల్లో ఓటర్లు ఎక్కువగా ఉన్నారు.
- అతి తక్కువగా విజయనగరంలో 18,95,099 మంది ఓటర్లు ఉన్నారు. శ్రీకాకుళం, కడప, నెల్లూరు జిల్లాలు తక్కువ ఓటర్లున్న జిల్లాల జాబితాలో ఉన్నాయి.
12 జిల్లాల్లో మహిళా ఓటర్లే అధికం
- తుది జాబితా ప్రకారం రాష్ట్రంలో పురుష ఓటర్లు కన్నా మహిళా ఓటర్లు 5,05,769 మంది అధికంగా ఉన్నారు.
- అనంతపురం జిల్లా మినహా మిగిలిన 12 జిల్లాల్లో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. గుంటూరులో అత్యధికంగా 94,131 మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ఆ తర్వాత కృష్ణాలో 63,942 మంది, పశ్చిమగోదావరిలో 61,162 మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు.
- అనంతపురం జిల్లాలో మాత్రమే మహిళా ఓటర్ల కంటే 873 మంది పురుష ఓటర్లు అధికంగా ఉన్నారు.
- అన్ని జిల్లాల కంటే కర్నూలు జిల్లాలో థర్డ్‌జెండర్ ఓటర్లు అధికంగా (577) ఉన్నారు. జిల్లాల వారిగా ఓటర్ల వివరాలు.
ఇదీ చదవండి: తెలుగు అక్షరమాల, అంకెలతో నగరానికి అలంకరణ