ETV Bharat / city

దుకాణాలు తెరిచేందుకు సరి, బేసి విధానం - ఏపీ కోవిడ్ టాస్క్​ఫోర్స్ ఛైర్మన్ కృష్ణబాబు వార్తలు

కంటెయిన్‌మెంట్‌ క్లస్టర్లు, బఫర్‌ జోన్లు మినహా ఇతర ప్రాంతాల్లోని దుకాణాలను సరి, బేసి సంఖ్య విధానంలో రోజు మార్చి రోజు తెరిచేలా ఆదేశాలివ్వనున్నట్లు కోవిడ్ టాస్క్​ఫోర్స్ ఛైర్మన్ కృష్ణబాబు చెప్పారు. రాష్ట్రానికి 15 వేల నుంచి 20 వేల మంది విదేశాల నుంచి ఏపీ వాసులు వచ్చే అవకాశం ఉందన్నారు. సోమవారం ఏపీ వాసులతో అమెరికా నుంచి మొదటి విమానం హైదరాబాద్​కు వస్తుందని వెల్లడించారు. వారందరినీ విజయవాడలోని క్వారంటైన్ కేంద్రానికి తరలిస్తామని తెలిపారు.

krishna babu
krishna babu
author img

By

Published : May 9, 2020, 7:36 PM IST

Updated : May 10, 2020, 7:35 AM IST

మీడియాతో కోవిడ్ టాస్క్​ఫోర్స్ ఛైర్మన్ కృష్ణ బాబు

కంటెయిన్‌మెంట్‌ కస్టర్లు మినహా అన్ని ప్రాంతాల్లో అనుమతి: కృష్ణబాబు

రాష్ట్రంలోని కంటెయిన్‌మెంట్‌ క్లస్టర్లు, బఫర్‌ జోన్లు మినహా ఇతర ప్రాంతాల్లోని దుకాణాలను సరి, బేసి సంఖ్య విధానంలో రోజు మార్చి రోజు తెరిచేలా ఆదేశాలివ్వనున్నట్లు రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు వెల్లడించారు. రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌ సహా ఏ జోన్‌ అయినా పరిమిత స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించాలని సీఎం జగన్‌ ఆదేశించారని చెప్పారు. ‘విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చేందుకు సుమారు 30 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 15 వేల నుంచి 20 వేల మంది వరకూ వస్తారని కేంద్ర విదేశాంగ శాఖ అంచనా. ఇందులో 65 శాతం గల్ఫ్‌ దేశాల నుంచి వస్తారు. తొలి విమానం ఈ నెల 11న హైదరాబాద్‌కు చేరుకుంటుంది. అక్కడి నుంచి ప్రయాణికులను విజయవాడకు తీసుకొచ్చి క్వారంటైన్‌ చేస్తాం. 14 రోజుల తర్వాత పరీక్షలు చేసి నెగిటివ్‌ వస్తే మరో 14 రోజులు హోం క్వారంటైన్‌లో ఉండాలి’ అని వెల్లడించారు.

స్టార్‌ హోటళ్లలో క్వారంటైన్‌
విదేశాల నుంచి వచ్చేవారు ప్రభుత్వ క్వారంటైన్‌ కేంద్రాల్లో ఉచితంగా ఉండొచ్చు. ఆర్థిక స్థోమత ఉన్నవారి కోసం స్టార్‌ హోటళ్లలో క్వారంటైన్‌ ఏర్పాటు చేశాం. వీటిని మూడు కేటగిరీలుగా విభజించాం. బడ్జెట్‌ కేటగిరీలో రోజుకు రూ.1500 నుంచి రూ.2 వేలు, మీడియంలో రూ.2 వేల నుంచి రూ.3 వేలు, లగ్జరీ కోసం రూ.3 వేల కన్నా ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. పన్నులు, ఆహారం అన్ని ఇందులోనే ఉంటాయి. నెగెటివ్‌ వచ్చిన వారిని జిల్లాలవారీగా విభజించి బస్సుల్లో ఆయా జిల్లా కేంద్రాలకు తరలిస్తాం. విదేశాల నుంచి వచ్చే వారిని సమీప ప్రాంతాలవారీగా విభజించాం. తూర్పుగోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాలవారిని విశాఖ విమానాశ్రయానికి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం వారిని విజయవాడకు, నెల్లూరు, రాయలసీమ జిల్లాల వారిని తిరుపతికి పంపాలని కేంద్రాన్ని కోరితే అంగీకరించింది.

అత్యవసరమైతేనే..
అత్యవసర కారణాలతో ఇతర ప్రాంతాలకు వెళ్లాలనుకునేవారికి పోలీసు శాఖ అనుమతులిస్తోంది. స్పందన.జీవోవీ.ఇన్‌ వెబ్‌సైట్‌ ద్వారా అత్యవసర పాసులు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశాం. అన్ని వివరాలతో కూడిన దరఖాస్తులను జిల్లా కంట్రోల్‌ సెంటర్‌కు పంపితే అక్కడ జేసీ, అదనపు ఎస్పీ పరిశీలించి ఆమోదిస్తే సంబంధితుల సెల్‌ఫోన్‌కు ఇ-పాస్‌ వెళ్తుంది.
ఇంతవరకు 11,860 వలస కార్మికులను 11 రైళ్లలో వారి సొంత రాష్ట్రాలకు పంపించామని కృష్ణబాబు తెలిపారు. మరో 14 రైళ్లలో 16,129 మందిని ఇతర రాష్ట్రాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి 12,273 మంది వచ్చారన్నారు. రాష్ట్ర పరిధిలో ఇతర జిల్లాల్లో చిక్కుకున్న వలస కూలీల్లో 80,689 మందిని ప్రభుత్వ ఖర్చుతో వారి స్వస్థలాలకు చేర్చినట్టు తెలిపారు.

సాయంత్రం 5గంటల వరకూ తెరిచేందుకు అనుమతి
కంటెయిన్‌మెంట్‌, బఫర్‌ జోన్లు మినహా అన్నిచోట్లా ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకు దుకాణాలను తెరిచేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఒకేచోట పక్కపక్కనే దుకాణాలు ఎక్కువ సంఖ్యలో ఉంటే మధ్యలో ఒకదాన్ని మూసివేసేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్‌ కమిషనర్లకు సూచించింది. గ్రామీణ ప్రాంతాల్లో మాల్స్‌ మినహా అన్ని దుకాణాలు తెరవచ్చు.

ఇదీ చదవండి

కరోనా పరీక్షల్లో రాష్ట్రానికి అగ్రస్థానం: సీఎం జగన్

Last Updated : May 10, 2020, 7:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.