రాష్ట్రంలో గత 24 గంటల్లో మొత్తం 41,003 మందిని పరీక్షించగా.. 129 మందికి కొవిడ్ సోకినట్లు వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. 147 మందికి వైరస్ నుంచి కోలుకోగా.. పశ్చిమగోదావరి జిల్లాలో ఒకరు మరణించినట్లు వెల్లడించింది. కృష్ణా జిల్లాలో అత్యధికంగా 26 మందికి.. ప్రకాశం, విజయనగరంలో అత్యల్పంగా ఒక్కొక్కరు మహమ్మారిబారిన పడ్డారని పేర్కొంది. గుంటూరు, విశాఖపట్నం జిల్లాల్లో 17, కర్నూలులో 15, చిత్తూరు, తూర్పుగోదావరిలో 12, కడపలో 9, నెల్లూరులో 8, పశ్చిమగోదావరిలో 6, అనంతపురంలో 3, శ్రీకాకుళంలో 2 చొప్పున కేసులు నమోదైనట్లు ప్రభుత్వం ప్రకటించింది.
ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 1,30,95,962 నమూనాలను పరీక్షించారు. వారిలో 8,87,720 మందికి కొవిడ్ సోకింది. 8,79,278 మంది కోలుకోగా.. మరో 1,289 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వైరస్ ధాటికి 7,153 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చదవండి: