ఏపీ పోలీసు శాఖకు, నల్సార్ యూనివర్సిటీ విద్యార్థులకు పరస్పర లాభం చేకూరేలా ఒప్పందం జరిగిందని డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు. చట్టంలోని వివిధ ప్రొసిజర్లు, కోర్టుల్లో ప్రత్యేక కేసులు , పూర్వపు జడ్జిమెంట్లు అనలైజింగ్, వివిధ కేసుల్లో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసిజర్స్ , చట్టాల అమలు పనితీరు గురించి సీఐడీ పోలీసులకు నల్సార్ వర్శిటీ ప్రతినిధులు అవగాహన కల్పిస్తారు. అదేవిధంగా నల్సార్ యూనివర్సిటీ విద్యార్థులకు అనుభవంతో కూడిన విజ్ఞానం, సమాజంలో జరుగుతున్న ఎకనామిక్ , ఫైనాన్స్ ఫ్రాడ్స్, మహిళల పట్ల జరుగుతున్న నేరాలు, సైబర్ నేరాలు, సంచలనాత్మకమైన సంఘటనలు గురించి పోలీసులు అవగాహన కల్పిస్తారని డీజీపీ తెలిపారు.
ఇదీ చదవండి: 'సైఫ్.. చరిత్రలోనే అత్యంత అందమైన రాక్షసుడు'