ETV Bharat / city

వ్యవ'సాయ'మే ప్రాధాన్యం... రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం ! - ఏపీ వ్యవసాయ బడ్జెట్

2020-21 ఆర్ధిక సంవత్సరానికి గానూ వ్యవసాయ ఇతర ఆనుబంధ శాఖలకు మొత్తంగా 29, 159 కోట్ల మేర బడ్జెట్​ను ప్రభుత్వం కేటాయించింది. వ్యవసాయ శాఖమంత్రి కె.కన్నబాబు శాసనసభలో బడ్జెట్​ను ప్రవేశపెట్టారు. ప్రత్యేకంగా వ్యవసాయానికి 15, 399 కోట్ల బడ్జెట్​ను కేటాయించామని మంత్రి తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి వ్యవసాయ రంగాని 34 శాతం మేర కేటాయింపులు తగ్గినప్పటికీ.. రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

కేటాయింపులు తగ్గినా...రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం !

author img

By

Published : Jun 16, 2020, 10:08 PM IST

Updated : Jun 17, 2020, 3:10 AM IST

ప్రత్యేక పరిస్థితుల మధ్య రెండు రోజుల పాటు జరగనున్న శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో వ్యవసాయ శాఖకు సంబంధించిన ప్రత్యేక బడ్జెట్​ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కె.కన్నబాబు శాసనసభలో తొలిసారి ఈ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. 2020-21 ఆర్ధిక సంవత్సరానికి మొత్తం 15 వేల 399 కోట్ల అంచనాలతో ఈసారి వ్యవసాయ బడ్జెట్​ను ప్రవేశపెడుతున్నట్టు మంత్రి కన్నబాబు పేర్కోన్నారు. ఇతర అనుబంధ శాఖలకు సంబంధించి 13, 820 కోట్లతో కూడిన బడ్జెట్​ను మంత్రి ప్రవేశ పెట్టారు. బడ్జెట్ కేటాయింపుల్లో అత్యధికంగా రైతు భరోసా పీఎం కిసాన్ పథకానికి ప్రభుత్వం కేటాయింపులు చేసింది. 2020-21 ఏడాదికి గానూ దీని కోసం 6885.60 కోట్లు కేటాయించారు. 2019-20 లో మొత్తం 46.69 లక్షల రైతుల కుటుంబాలకు 6534 కోట్ల రూపాయలు కేటాయించనట్టు వ్యవసాయ మంత్రి తెలిపారు.

వైఎస్​ఆర్ జనతా బజార్లు

వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం ధరల స్థిరీకరణ నిధికింద 3 వేల కోట్లను కేటాయించారు. రాష్ట్రవ్యాప్తంగా 10, 641 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు మంత్రి వివరించారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు బ్యాంకింగ్ సేవలు అందించేందుకు 100 కోట్లు కేటాయిస్తున్నట్లు మంత్రి తన ప్రసంగంలో పేర్కోన్నారు.

నూతనంగా ప్రతీ గ్రామంలో వ్యవసాయ ఉత్పత్తుల ప్యాకింగ్ , గ్రేడింగ్ కోసం యూనిట్లను ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి కన్నబాబు స్పష్టం చేశారు. వైఎస్ఆర్ జనతా బజార్లను కూడా ఏర్పాటు చేయనున్నట్టు బడ్జెట్ ప్రసంగంలో పేర్కోన్నారు. పంటల భీమా అమలుకు 500 కోట్లను ప్రతిపాదించారు. రాష్ట్రవ్యాప్తంగా 147 నియోజకవర్గాల్లో అగ్రి టెస్టింగ్ ల్యాబ్ లను ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి తెలిపారు. దీనికోసం 65 కోట్లు కేటాయించినట్టు వెల్లడించారు.

ఆర్థిక సాయానికి ప్రత్యేక కేటాయింపు

వడ్డీ లేని పంటరుణాల పథకం అమలు కోసం 1100 కోట్లు కేటాయించినట్లు కన్నబాబు స్పష్టం చేశారు. ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలకు ఆర్ధిక సాయం అందించేందుకు 20 కోట్లు ప్రతిపాదించినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో వ్యవసాయరంగానికి చెందిన అంశాలను పర్యవేక్షించేందుకు ఏర్పాటు చేసిన వ్యవసాయ మిషన్ నిర్వహణకు కు 2.61 కోట్లు కేటాయించామన్నారు.

ప్రకృతి వ్యవసాయానికి చేయూత

రాయితీపై విత్తనాల సరఫరా చేసేందుకు 200 కోట్లు ప్రతిపాదించారు. వ్యవసాయ యాంత్రీకరణ కార్యక్రమం అమలు కోసం 207 కోట్లను ప్రతిపాదిస్తున్నట్టు మంత్రి తెలిపారు. ఇక రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో సమీకృత వ్యవసాయ విధానం అమలుకు 141 కోట్లు కేటాయించారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు గానూ 225 కోట్లు కేటాయించారు. ప్రకృతి విపత్తుల సహాయ నిధిగా 2000 కోట్లను కేటాయించినట్టు వ్యవసాయ మంత్రి పేర్కోన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగాన్ని ప్రోత్సహించేందుకు గానూ నూతన విధానాన్ని అమలు చేయనున్నట్టు వెల్లడించారు. కొత్తగా రాష్ట్రంలో వ్యవసాయ సలహా మండళ్లను ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి కన్నబాబు తెలిపారు.

సౌర విద్యుత్ ప్లాంట్ నిర్మాణం

ఉద్యాన శాఖకు 653 కోట్లు కేటాయిస్తున్నట్టు కన్నబాబు వెల్లడించారు. పట్టు పరిశ్రమశాఖకు 92 కోట్లు, పశుసంవర్ధక శాఖకు 854 కోట్లు ,మత్య్సశాఖకు 299 కోట్లు, సహకార రంగానికి 248 కోట్లు కేటాయిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్ అమలు చేసేందుకు 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ నిర్మించనున్నామని .. వ్యవసాయ విద్యుత్ సబ్సీడీ కోసం ఈ ఏడాది 4450 కోట్లను ఖర్చు చేయనున్నట్టు మంత్రి స్పష్టం చేశారు. వ్యవసాయానికి ఉపాధి హామీ నిధులను అనుసంధానించటంతో పాటు ఆత్మనిర్భర్ భారత్ అభియాన్​లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా శీతలీకరణ గిడ్డంగులు, గ్రేడింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తామన్నారు.

2019-20లో 180.54 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి జరిగిందని మంత్రి స్పష్టం చేశారు.

Last Updated : Jun 17, 2020, 3:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.