తెదేపా హయాంలో 63లక్షల మంది రైతులకు అన్నదాత సుఖీభవ, ఇతర రైతు ప్రయోజన పథకాలను అమలు చేశామని ఎమ్మెల్యే అనగాని అన్నారు. అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్.. కోటి మంది రైతులు ఉంటే కుదించేశారని రాద్దాంతం చేశారని, ఇప్పుడు 50 లక్షల మంది రైతులు మాత్రమే ఉన్నారని దగా చేస్తున్నారని దుయ్యబట్టారు. ఒక్కో రైతుకు 30 వేల రూపాయలు చొప్పున కోత పెడుతూ కేంద్రం ఇచ్చే 6 వేలు కూడా కలిపి మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. తెదేపా అమలు చేసిన లక్షన్నర రుణమాఫీని వాయిదాల్లో చేస్తారా? అని ప్రశ్నించిన జగన్.. ఇప్పుడు ఇచ్చే 7,500 రూపాయలను మూడు వాయిదాల్లో ఇస్తామని మాట తప్పారని అనగాని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల సంక్షేమం, అభివృద్ధి, పురోభివృద్ధికి ఉపయోగపడే పథకాలన్నింటినీ రద్దు చేశారని మండిపడ్డారు.
ఇదీ చదవండి: ఆంక్షలున్నా...ఆగని బన్నీ ఉత్సవం