తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు నెలకొనగా.. తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడతామని రెండ్రోజుల క్రితం షర్మిల ట్విట్టర్‌లో ప్రకటించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరినైనా ఎదురిస్తామని తెలిపారు. తెలంగాణకు నీటి కేటాయింపుల్లో ఒక్క చుక్క అన్యాయం జరిగినా సహించేది లేదంటూ ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్‌పై ఆగ్రహించిన రైతులు కృష్ణా జలాలపై వైఖరి చెప్పాలంటూ షర్మిల నివాసం ముందు ఆందోళనకు దిగారు. వీరితో అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు కూడా కలిశారు. షర్మిల ట్వీట్‌ను తప్పుగా అర్ధం చేసుకున్నారంటూ ఆమె ప్రతినిధులు రైతులకు సర్ధి చెప్పే ప్రయత్నం చేశారు. కృష్ణా జలాల విషయంలో తెలంగాణ వాటా కేటాయింపుల్లో నష్టం జరిగితే చూస్తూ ఊరుకునేది లేదని.. వాటి కోసం నిలబడతానని షర్మిల స్పష్టంగా ప్రకటించినట్టు వివరించారు. కృష్ణా బోర్డు కేటాయింపుల్లో అన్యాయం జరిగితే... తెలంగాణ ప్రజల హక్కుల కోసం పోరాడతానని తెలిపినట్టు స్పష్టం చేశారు.
రైతులపై ఆగ్రహం...
ఈ క్రమంలో అమరావతి పరిరక్షణ సమితి సభ్యులతో షర్మిల అనుచరులు వాగ్వాదానికి దిగారు. రాయలసీమకు నష్టం చేసే ఏ పని చేయకూడదని.. కృష్ణానదీ జలాలపై సీమ రైతులకు అన్యాయం జరిగేలా మాట్లాడకూడదని రైతులు వాదించారు. ఎంత చెప్పినా వినకపోయేసరికి వారిపై షర్మిల అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిరక్షణ సమితి సభ్యులను షర్మిల అనుచరులు పరిగెత్తించగా.. వచ్చినవాళ్లు వాహనాల్లో వెళ్లిపోయారు.
ఇదీ చూడండి:
AP - TS Water Dispute: జలజగడం.. సాగర్‌లో ఉద్రిక్తం.. భద్రత కట్టుదిట్టం!