ETV Bharat / city

మాధవ్​పై చర్యలకు మహిళా నేతల డిమాండ్‌.. డీజీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

MP Madhav Video Issue: ఎంపీ గోరంట్ల మాధవ్​పై చర్యలకు డిమాండ్ చేస్తూ అఖిల పక్షాల మహిళా నేతలు ఫిర్యాదు చేసేందుకు డీజీపీ కార్యాలయం వద్దకు వెళ్లగా అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. మహిళా నేతలను డీజీపీ కార్యాలయం బయటే పోలీసులు అడ్డుకున్నారు. పబ్లిక్ హాలీడే కావడంతో అధికారులెవరూ లేరని..,తర్వాత రావాలని పోలీసులు సూచించటంతో మహిళా నేతలు వారితో వాగ్వాదానికి దిగారు.

మాధవ్​పై చర్యలకు మహిళా నేతల డిమాండ్‌
మాధవ్​పై చర్యలకు మహిళా నేతల డిమాండ్‌
author img

By

Published : Aug 9, 2022, 8:19 PM IST

Updated : Aug 10, 2022, 6:48 AM IST

మాధవ్​పై చర్యలకు మహిళా నేతల డిమాండ్‌

All Party Women Leaders Protest At DGP Office: వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్‌ అసభ్య వీడియోలతో రాష్ట్రం పరువు పోయిందని, ఆయనపై చర్యలు తీసుకునే వరకు ఐక్యంగా పోరాడాలని పలువురు మహిళానేతలు తీర్మానించారు. ఏపీ మహిళా హక్కుల పరిరక్షణ సమితి మంగళవారం విజయవాడలో రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించింది. తెదేపా, జనసేన, భాజపా, కాంగ్రెస్‌, వామపక్షాలు, లోక్‌సత్తా పార్టీలతో పాటు వివిధ మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ‘వైకాపా అధికారం చేపట్టాక రాష్ట్రంలో 2 వేల మందికి పైగా మహిళలపై అఘాయిత్యాలు జరిగాయి. విశాఖ, విజయవాడ, నెల్లూరుల్లో పట్టపగలు యువతులను చంపేశారు. రమ్య.. అనూష.. చెప్పుకుంటూ పోతే ఎందరో ఆడపిల్లలు బలైనా నేరగాళ్లపై కఠిన చర్యలు తీసుకోలేదు. ప్రభుత్వ ఉదాసీన వైఖరికి నిరసనగా పార్టీలకతీతంగా దిల్లీలో ఉద్యమించాలి’ అని నేతలు పిలుపునిచ్చారు. అమరావతి ఉద్యమాన్ని నడిపిస్తున్న మహిళలను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు.

చర్యలకు ఎందుకు వెనకడుగు?
తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత మాట్లాడుతూ ‘గోరంట్ల మాధవ్‌ ఎంపీ పదవికి కళంకం తెచ్చారు. మన రాష్ట్ర ఎంపీ వీడియో చూసి మిగిలిన రాష్ట్రాల నేతలు నవ్వుకుంటున్నారు. బాధితురాలు ఎంత ఇబ్బంది పడితే.. ఆ వీడియో బయట పెడుతుంది? తప్పు చేసిన వారిపై చర్యలకు బదులుగా జగన్‌ పదోన్నతులిస్తున్నారు. రోజా, సజ్జల వంటి వాళ్లు నాలుగు గోడల మధ్య జరిగే వాటితో పార్టీకి సంబంధం లేదంటున్నారు. అది నాలుగు గోడలు దాటి బయటకు వచ్చింది’ అని పేర్కొన్నారు. సీపీఐ నాయకురాలు దుర్గాభవాని మాట్లాడుతూ అశ్లీల వీడియోలో ఉన్న ఎంపీపై చర్యలు తీసుకోలేని హీనస్థితిలో ప్రభుత్వం ఉందని దుయ్యబట్టారు. కేసు మాఫీ చేస్తే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ‘నేతలకు టిక్కెట్లు ఇచ్చేటప్పుడే పార్టీలు వారి గుణగణాలు తెలుసుకోవాలి. ఇలాంటి ఘటనలను కులాలు, మతాలకు ఆపాదించడం తగదు. స్వాతంత్య్ర అమృతోత్సవాల వేళ రాజకీయాల్లో విలువలపైనా చర్చించాలి’ వాసవ్య మహిళా మండలి అధ్యక్షురాలు కీర్తి పేర్కొన్నారు. కాంగ్రెస్‌ నాయకురాలు సుంకర పద్మశ్రీ ప్రసంగిస్తూ ‘బాధితురాలు ఫిర్యాదు చేయనప్పుడు ఎవరికేం బాధ అని సజ్జల మాట్లాడటం హేయం. ప్రతిపక్షాల ట్వీట్లపై సుమోటో కేసులు పెడుతున్న ప్రభుత్వం.. ఎంపీ నిర్వాకంపై ఫిర్యాదు ఎలా అడుగుతుంది?’ అని ప్రశ్నించారు. తెదేపా తెలంగాణ మహిళా అధ్యక్షురాలు జ్యోత్స్న, జనసేన, లోక్‌సత్తా పార్టీ మహిళా నేతలు సౌజన్య, మాలతిలు ప్రసంగిస్తూ ‘మహిళలపై అఘాయిత్యాలు జరుగుతుంటే వైకాపా మంత్రులు పట్టనట్లు వ్యహరిస్తున్నారు. మహిళా కమిషన్‌ అధికార పక్షానికి అనుకూలంగా మారింది’ అని మండిపడ్డారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలు చేశారు. ప్రభుత్వ తీరుపై ఆగస్టు 15న జాతీయ జెండాలతో పాదయాత్ర చేయాలని, కేంద్ర, రాష్ట్ర మహిళా కమిషన్లకు ఫిర్యాదు చేయాలని, కేంద్రంలోని మహిళా మంత్రులు, ఎంపీలను కలిసి వివరించాలని నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని సస్పెండ్‌ చేయాల్సిందిగా కేంద్రాన్ని కోరాలని తీర్మానించారు. ఈ కేసును సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించాలని కోరారు.

..
..

డీజీపీ కార్యాలయంలోకి పరిమితంగా అనుమతి

తాడేపల్లి, న్యూస్‌టుడే: అఖిలపక్ష భేటీ తర్వాత పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడానికి మహిళా నేతలు డీజీపీ కార్యాలయానికి వెళ్లగా, పోలీసులు చాలాసేపు గేటు బయటే నిలిపేశారు. మంగళవారం పబ్లిక్‌ హాలీడే అని, డీజీపీ కార్యాలయంలో ఉన్నతాధికారులెవరూ లేరని చెప్పారు. ‘24 గంటలూ పనిచేయాల్సిన పోలీసులకు సెలవులేంటి? పబ్లిక్‌ హాలీడే అయితే నేరాలు జరగవా? ఫిర్యాదులు తీసుకోరా?’ అని మహిళలు నిలదీయడంతో ఆరుగురిని లోపలికి పంపించారు. ఐపీఎస్‌ అధికారులెవరూ లేకపోవటంతో సిబ్బందికి ఫిర్యాదు ఇచ్చినట్లు మహిళలు తెలిపారు. దీనిపై వంగలపూడి అనిత మాట్లాడుతూ రాష్ట్రంలో ‘రేప్‌’ జరిగినా సరే, ‘రేపు రండి’ అనేలా డీజీపీ కార్యాలయం ఉందని మండిపడ్డారు. గేటు బయట ఉండిపోయిన నాయకురాళ్లు మీడియాతో మాట్లాడేందుకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు.

అనితకు బెదిరింపు కాల్‌

..
..

సమావేశం జరుగుతుండగానే తెదేపా నేత అనితకు కర్నూలు జిల్లాకు చెందిన వైకాపా నేత (98489 75369) నుంచి ఫోన్‌కాల్‌ వచ్చింది. ఆమె స్పీకర్‌ ఆన్‌ చేసి.. మీడియా ప్రతినిధులకు వినిపించారు. అవతలి వైపు నుంచి మాట్లాడుతున్న వ్యకి ‘ఏం తప్పు చేశారని ఎంపీ మాధవ్‌ గురించి మాట్లాడుతున్నారు. ఆయన వ్యవహారంలో అతిగా స్పందించాల్సిన అవసరమేంటి? దర్యాప్తు జరుగుతుంటే అనవసర చర్చ ఎందుకు? రాష్ట్రంలో ఇలాంటివి ఎన్నో జరుగుతుంటే.. మాధవ్‌పైనే ఎందుకు మాట్లాడుతున్నారు’ అని బెదిరించారు.

ఇవీ చూడండి

Last Updated : Aug 10, 2022, 6:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.