ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అమూల్‌పై ఉన్న శ్రద్ధ రాష్ట్రంలో డెయిరీలపై ఎందుకు లేదని తెదేపా నేత, మాజీమంత్రి ఆలపాటి రాజా నిలదీశారు. రాష్ట్రంలో పాల డెయిరీలను నిర్వీర్యం చేస్తూ పాడి రైతులను ఆదుకుంటున్నామని ముఖ్యమంత్రి చెప్పడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. పాడి రైతులపై అంత ప్రేమే ఉంటే రాష్ట్రంలోని 13 సహకార, 7 ప్రైవేటు డెయిరీలను కాదని గుజరాత్ సంస్థతో ఎందుకు ఒప్పందం చేసుకున్నారని ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో లీటర్ పాలకు 4 రూపాయలు బోనస్ ఇస్తామని ఇచ్చిన హామీని ప్రభుత్వం విస్మరించిందన్నారు.
ఇదీ చదవండి: RRR: 'జడ్జి రామకృష్ణను పీలేరు జైలు నుంచి ఆస్పత్రికి తరలించండి'