విజయవాడ అజిత్‌సింగ్‌నగర్ రాజరాజేశ్వరి పేటలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. దక్షిణ మండల ఏసీపీ షేక్ షాను ఆధ్వర్యంలో పోలీసులు 15 బృందాలుగా విడిపోయి.. 350 గృహాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. పలువురు పాత నేరస్తులు దొరకగా.. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఈ కార్యక్రమం జరిపినట్లు పోలీసులు తెలిపారు.
గంజాయి, బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు ఇటీవల పెరిగిపోయాయని ఫిర్యాదులు అందడంతో.. రాజరాజేశ్వరి పేటలో ఆకస్మిక తనిఖీలు చేపట్టినట్లు ఏసీపీ తెలిపారు. తమ పరిధిలోని నాలుగు పోలీస్ స్టేషన్లు.. నిరంతరం ఇలా నిర్బంధ సోదాలు కొనసాగిస్తూనే ఉంటాయన్నారు.
ఇదీ చదవండి: ఇందిరాగాంధీ మైదానంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు..విస్తృత ఏర్పాట్లు