విజయవాడ దాసరి భవన్ లో 13 జిల్లాల అగ్రిగోల్డ్ బాధితులు మరియు ఏజెంట్ల సమావేశం జరిగింది. బాధితులకు తక్షణమే నిధులు విడుదల చేయాల్సిందిగా ముఖ్యమంత్రిని కలిసి మెమొరాండం అందజేస్తామని అగ్రిగోల్డ్ బాధితుల సంఘం గౌరవాధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు సంబంధించిన సమాచారం ప్రభుత్వం వద్ద ఉందని..దాని ఆధారంగా బాధితులకు చెల్లింపులు చేయాలని విజ్ఞప్తి చేశారు. జగన్ బాధితులకు న్యాయం చేస్తారని విశ్వసిస్తున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు.
అగ్రిగోల్డ్ బాధితులకు తక్షణమే నిధులు విడుదల చేయాలి!
నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో 20 వేల లోపు బకాయిలు చెల్లిస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ...అమలు చేయాలని అగ్రిగోల్డ్ బాధితుల సంఘం గౌరవాధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు కోరారు.