నివాసల మధ్య ప్రభుత్వ లిక్కర్ గోడౌన్‌ను ఏర్పాటు చేయవద్దంటూ విజయవాడ కబేళ సెంటర్లోని కిరణ్ అపార్ట్మెంట్ వాసులు ఆందోళన చేపట్టారు. లక్షల రూపాయిలు పోసి అపార్ట్మెంట్లో ప్లాట్లు కొనుక్కున్నామని..మొదటి ఫ్లోర్లో రెండు ఫ్లాట్లను ఎటువంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ లిక్కర్ గోడౌన్‌కి బిల్డర్ అద్దెకు ఇచ్చాడని ఆరోపించారు. కుటుంబాల ఉండే మధ్య లిక్కర్ గోడౌన్‌కు అద్దెకివ్వడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన తమ గోడు వినడం లేదని వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Live video: భక్తి విన్యాసంలో అపశృతి.. క్రేన్‌పై వేలాడుతూ కిందపడ్డ భక్తుడు
JAGAN CASE: రాంకీ ఫార్మా కేసులో అయోధ్యరామిరెడ్డి వాదనలు