పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ రద్దు చేసి.. కొత్త నోటిఫికేషన్ జారీ చేయాలని హైకోర్టు ఆదేశించినట్లు న్యాయవాది నర్రా శ్రీనివాస్ తెలిపారు. మళ్లీ నోటిఫికేషన్ అంటే అన్నీ రద్దయ్యే పరిస్థితి నెలకొందని అన్నారు. ఎన్నికలు మొదట్నుంచీ జరపాలని హైకోర్టు ఆదేశించినా..ఎన్నికల నిబంధనలు సరిగా అమలు చేయలేదని ఆరోపించారు.
సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా పరిషత్ ఎన్నికలు జరగలేదని హైకోర్టు స్పష్టం చేసినట్లు తెలిపారు. ఏకగ్రీవాలపై ఎస్‌ఈసీ ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలని అన్నారు.
ఇదీచదవండి
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ రద్దుచేస్తూ హైకోర్టు తీర్పు