విజయవాడలో గత 20 ఏళ్లుగా వస్త్రాభిమానుల మన్ననలు అందుకుంటున్న కళాంజలి షోరూమ్.. తాజాగా కొత్త భవనంలోకి మారింది. బందరు రోడ్డులో సిద్ధార్థ మహిళా కళాశాలకు వెళ్లే దారిలో ఏర్పాటు చేసిన నూతన భవనాన్ని.. ప్రముఖ సినీ, టీవీ నటి రష్మీగౌతమ్, మేయర్ తదితరుల చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాంజలి షోరూంలోని దుస్తులపై ప్రత్యేక రాయితీలు ప్రకటించారు. ఈ ప్రత్యేక ఆఫర్లు ఏప్రిల్ 30 వరకు అందుబాటులో ఉంటాయని కళాంజలి షోరూం నిర్వాహకులు తెలిపారు. కళాంజలి షోరూంను సందర్శించి.. నాణ్యమైన వస్త్రాలు పొందాలని రష్మీగౌతమ్ సూచించారు.
ఇదీ చదవండి: యాక్షన్ మోడ్లో 'చిరు 154'.. 'సూపర్ గర్ల్' మూవీ షూటింగ్ షురూ