పల్నాడు జిల్లా దాచేపల్లిలో తెదేపా కార్యకర్త ఇంటిపై దాడిని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఖండించారు. ఆస్తులు ధ్వంసం, అక్రమ కేసులపైనే సీఎం జగన్ ధ్యాస పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడులు, ప్రాణాలు తీయడంపైనే వైకాపా కార్యకర్తల ఆలోచన ఉందన్నారు. ప్రజలకు ఏదైనా చేద్దామన్న ధ్యాస సీఎంకు ఏమాత్రం లేదని దుయ్యబట్టారు. అరాచకాలు, ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండాపోతోందని మండిపడ్డారు. అరాచకాలకు తెగబడుతూ ప్రజలను భయపెడుతున్నారని ఆరోపించారు. నాగులు ఇంటిపై దాడిచేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. 2024లో అధికారంలోకి వచ్చేది తెదేపా ప్రభుత్వమేనని దీమా వ్యక్తం చేశారు. అరాచక వైకాపా రౌడీ మూకలకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని తెదేపా నేత అచ్చెన్నాయుడు అన్నారు.
సంబంధిత కథనం: మున్సిపల్ ఎన్నికల్లో ఓటేయలేదని.. దాచేపల్లిలో తెదేపా కార్యకర్త ఇంటిపై దాడి
'ప్రాణాలు తీయడంపైనే వైకాపా కార్యకర్తల ఆలోచన... రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం'
దాచేపల్లిలో తెదేపా కార్యకర్త ఇంటిపై దాడిని అచ్చెన్నాయుడు ఖండించారు. ప్రాణాలు తీయడంపైనే వైకాపా కార్యకర్తల ఆలోచన ఉందన్నారు. అరాచక వైకాపా రౌడీ మూకలకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని చెప్పారు.