ప్రజల్ని ఏదో విధంగా మోసం చేయటమే సీఎం జగన్ లక్ష్యంగా ఉందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. అక్రమంగా ఇళ్లు కూల్చేటప్పుడు వీడియో తీస్తుంటే పాకిస్థాన్లో కూడా లేనివిధంగా కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ఇస్తామన్న పరిహారం ఇవ్వకుండా... చిత్తూరు జిల్లా బోయకొండ గంగాపురం గ్రామానికి చెందిన పులసర శివకుమార్ ఇంటిని కూల్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు నిబంధనలకు విరుద్ధంగా కొంత పరిహారమే ఇచ్చి వైకాపా నాయకులు దగ్గరుండి ఇళ్లు పడగొట్టించటంపై ఆయన మండిపడ్డారు.
రూ.36 లక్షలు పెద్దిరెడ్డి, ఆయన అనుచరుల జేబుల్లోకి మళ్లించేందుకు కుట్ర చేశారని ఆరోపించారు. భావ ప్రకటనా స్వేచ్ఛ హక్కును రాష్ట్రంలో హరిస్తున్నారని..,ముందస్తు సమాచారం లేకుండా ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించడం ఎంతవరకు సబబని అచ్చెన్న ప్రశ్నించారు. పెద్దిరెడ్డి అరాచకాలకు చిత్తూరులో అడ్డు లేకుండా పోయిందని దుయ్యబట్టారు. ప్రజలకు ఉపయోగపడే పనులు కాకుండా కార్యకర్తలకు, నాయకులకు, కాంట్రాక్టర్లకు ఉపయోగపడే కార్యక్రమాలను జగన్ ప్రభుత్వం చేస్తోందని ఆరోపించారు.
ఇదీచదవండి