సంగం డెయిరీ ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్రకుమార్, ఎండీ గోపాలకృష్ణన్‌కు మే 24న మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ అనిశా గుంటూరు డీఎస్పీ హైకోర్టులో వేర్వేరుగా 2 వ్యాజ్యాలు దాఖలు చేశారు. బెయిలు షరతులను ఉల్లంఘించారని పేర్కొన్నారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్.రఘునందన్ రావు ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపారు. కౌంటర్ వేయాలని ధూళిపాళ్ల తరపు న్యాయవాదిని ఆదేశిస్తూ.... విచారణను ఈ నెల 23 కు వాయిదా వేశారు. బెయిల్ పై విడుదలయ్యాక సంగం బోర్డు డైరెక్టర్లు, ఇతర అధికారులతో నోవాటెల్ హోటల్లో ధూళిపాళ్ల సమావేశం నిర్వహించారని....అనిశా తరపు న్యాయవాది తెలిపారు. ఈ సమావేశంలో గోపాలకృష్ణతో పాటు 25 మంది పాల్గొన్నారన్నారని... వారికి పలు సూచనలు చేశారని కోర్టుకు తెలిపారు. సమావేశం నిర్వహించడం ద్వారా సాక్షులను ప్రభావితం చేస్తున్నారని....అందుకే బెయిలు రద్దు చేయండి అని అని అనిశా అధికారులు కోరారు.
ఇదీచదవండి
AP Jobs: జాబ్ క్యాలెండర్ విడుదల.. ఇకనుంచి ఇంటర్వ్యూలు లేవ్!