ఈఎస్ఐ అవకతవకల కేసులో అవినీతి నిరోధక శాఖ అధికారులు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. అమరావతి మెడికల్స్ యజమాని శ్రీరామ్మూర్తి, పెదకాకాని ఈఎస్ఐలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న వేణుగోపాల్లను అరెస్ట్ చేసినట్లు అనిశా అధికారులు తెలిపారు. ఈఎస్ఐ మాజీ డైరెక్టర్లు విజయ్ కుమార్, రమేశ్ కుమార్‌లు కార్యాలయ సిబ్బందితో కలిసి మరొక సంస్థ పేరుతో నకిలీ కొటేషన్లు ఇచ్చినట్లు గుర్తించామని చెప్పారు.
రేట్ ఆఫ్ కాంట్రాక్ట్ కన్నా 50 శాతం అధిక ధరలకు కొనటంతో ప్రభుత్వ ఆదాయానికి నష్టం వచ్చిందని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. అరెస్ట్ చేసిన ఇద్దరిని విజయవాడ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచగా ఈ నెల 26 వతేదీ వరకు రిమాండ్ విధించింది. వారిని రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తరలించారు.
ఇవీ చదవండి...
భారత్-చైనా సరిహద్దు ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన కల్నల్ సంతోష్