తెలంగాణలోని నల్గొండ పట్టణంలోని బహదూర్ ఖాన్ భవనంలో శుక్రవారం సాయంత్రం ముస్లిం మైనారిటీ పట్టభద్రులతో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం పాల్గొన్నారు.
ఈ భేటీలో.. ప్రజల పక్షాన చట్టసభల్లో గొంతు వినిపించడం కోసం ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నట్లు కోదండరాం తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి తెరాస ప్రభుత్వం ముస్లిం మైనారిటీలకు ఎలాంటి ప్రయోజనం కలిగే పనులు చేయలేకపోయిందని విమర్శించారు. అన్ని వర్గాలకు సమన్యాయం అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. తనను చట్ట సభలకు పంపిస్తే... ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడానికి పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: