pension in vizianagaram: విజయనగరం కలెక్టరేట్ వద్ద నిర్వహించిన స్పందన కార్యక్రమంలో హృదయ విదారకమైన దృశ్యం కనిపించింది . పక్షవాతంతో రెండు కాళ్లూ, నడుము పని చేయని వృద్ధురాలిని కుటుంబ సభ్యులు మంచంపై మోసుకొచ్చారు... పింఛన్ కోసం పడుతున్న కష్టం అందర్నీ కలచివేసింది. నెల్లిమర్ల మండలం తాళ్లపూడిపేటకు చెందిన సీతమ్మకు.. 70 సంవత్సరాలు. స్థానికంగా చేపట్టిన పింఛన్ల దర్యాప్తునకు అనారోగ్యం కారణంగా హాజరు కాలేకపోయింది. ఫలితంగా పింఛన్ జాబితా నుంచి అధికారులు ఆమె పేరుని తొలగించారు. అప్పటి నుంచి పలుమార్లు అధికారులకు మొరపెట్టుకున్నా స్పందన కరవైంది. పింఛన్ కోసం నడవలేని పరిస్థితిలో ఉన్న వృద్ధురాలిని కుమారుడుతోపాటు తోటి మహిళలు కలెక్టరేట్‌కు మంచంపై మోసుకొచ్చారు. కలెక్టర్ లేని కారణంగా అధికారులు ఆమె నుంచి దరఖాస్తు స్వీకరించారు. పింఛన్ మంజూరు చేయాలని 6 నెలలుగా అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని వృద్ధురాలు వాపోయారు.
ఇదీ చదవండి: ఇకపై ఫిర్యాదు చేయాలంటే..పీఎస్‌కు వెళ్లాల్సిన పనిలేదు.. అలా చేయొచ్చు