GOVT MEETING ON EHS : ఉద్యోగుల ఆరోగ్య పథకం(ఈహెచ్ఎస్) అమల్లో నెలకొన్న సమస్యలపై చర్చకోసం.. సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఉద్యోగ సంఘాల స్టీరింగ్ కమిటీ ప్రతినిధులతో ఆర్థిక, వైద్యారోగ్య శాఖల ముఖ్య కార్యదర్శలు చర్చించారు. ఈహెచ్ఎస్ వల్ల ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అధికారులను స్టీరింగ్ కమిటీ నేతలు కోరారు.
ఈ పథకంలో కొన్ని కొత్త వైద్య విధానాలు చేర్చాలన్నారు. మెడికల్ రీఎంబర్స్మెంట్ పథకాన్ని ఈ ఏడాది జూన్ వరకూ పొడిగించాలని కోరారు. ఆరోగ్యశ్రీ బిల్లుల తరహాలో.. ఈహెచ్ఎస్ బిల్లుల్ని సకాలంలో చెల్లించాలన్నారు. మేనేజ్మెంట్ కమిటీల్లో పెన్షనర్ల ప్రతినిధులను సభ్యులుగా చేర్చడం వంటి అంశాల అమలుపై అధికారులు సానుకూలంగా స్పందించారు. అన్నింటినీ సీఎస్ దృష్టికి తీసుకువెళ్లి.. అమలుకు చర్యలు తీసుకుంటామని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల ముఖ్యకార్యదర్శులు ప్రకటనలో తెలిపారు.
ఇదీ చదవండి : కేంద్రం కొత్త రూల్స్- బైక్పై పిల్లలతో వెళ్తే ఇవి తప్పనిసరి!