తెలంగాణలోని నారాయణపేట జిల్లా మాగనూరు మండలం బైరంపల్లి గ్రామానికి చెందిన కురువ హనుమంతు కుటుంబం పెద్ద మనసుతో ఆలోచించింది. తమ వల్ల తమ గ్రామానికి, ప్రజలకు ఎలాంటి సమస్య రాకూడదని బెంగళూరు నుంచి వలస రావడంతోనే ఊరికి దూరంగా తమ సొంత పొలంలో గుడారం వేసుకుని జీవనం సాగిస్తున్నారు. భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి సుమారు నాలుగు రోజుల కిందట వలస వచ్చారు.
అధికారుల అభినందనలు...
ఈ విషయం తెలుసుకున్న అధికారులు కురువ హనుమంతు కుటుంబం తీసుకున్న నిర్ణయాన్ని అభినందించారు. వెంటనే వారికి కావాల్సిన సదుపాయాలు కల్పించి నిత్యావసరాలకు లోటు రాకుండా చూసుకుంటున్నారు. నిరంతరం వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. కురువ హనుమంతు కుటుంబాన్ని ఆదర్శంగా ప్రతి ఒక్కరూ తీసుకుని స్వీయ నిర్బంధంలో ఉండి కరోనా వ్యాప్తిని అరికట్టడంలో బాధ్యతగా వ్యవహరించాలని అధికారులు కోరుతున్నారు.
ఇదీ చూడండి: మాస్కు ఎవరు వాడాలి? తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి?