- మోగిన నగారా
దేశంలో కీలకమైన 4 రాష్ట్రాలు, ఓ కేంద్రపాలిత ప్రాంతంలో శాసనసభ ఎన్నికలకు నగారా మోగింది. బంగాల్‌లో 8 విడతలు, అసోంలో మూడు విడతల్లో ఎన్నికలు జరగనుండగా, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలు మే 2న వెలువడనున్నాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- ఇక సమరమే
నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది ఎన్నికల సంఘం. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణలను ఓసారి పరిశీలిద్దాం. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- ఉత్తమ వాలంటీర్లకు సత్కారాలు
వైఎస్ఆర్ ఆసరా, చేయూత, జగనన్న తోడు పథకాలకు దరఖాస్తు చేసుకున్న వారందరికీ వీలైనంత త్వరగా సహకారం అందించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. బ్యాంకర్లు, అధికారులు సమన్వయంతో ముందుకు కదలాలని సూచించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'పోలీసులు లేకుండా కుప్పంలో తిరగగలరా?'
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో రెండోరోజు చంద్రబాబు పర్యటన కొనసాగింది. తెలుగుదేశం పార్టీకి కుప్పం కంచుకోట అని.. ఎవరెన్ని కుట్రలు చేసినా భయపడే పరిస్థితి లేదని చంద్రబాబు అన్నారు. పోలీసులు లేకుండా కుప్పంలో ఒక్క వీధిలోనైనా తిరగగలరా? అని అధికార పార్టీ నేతలను తెదేపా అధినేత ప్రశ్నించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- మార్చి ఒకటిన భేటీ
మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు వివిధ పార్టీ నేతలతో ఎస్ఈసీ అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీకి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులను ఆహ్వానించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'పునరాలోచించాలి'
విశాఖపట్నం ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉన్న స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించవద్దని ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచించాలని కోరారు. లేనిపక్షంలో నిరసనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'ప్రపంచ దేశాలకు మోదీ అనుసరణీయం'
ప్రపంచ దేశాలకు వాక్సిన్ పంపిణీ చేస్తున్నారంటూ.. ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధనోమ్. ఈ విషయంలో ప్రపంచ దేశాలన్నీ మోదీనే అనుసరిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- రికార్డు పతనం
స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయిలో కుప్పకూలాయి. సెన్సెక్స్ 1939 పాయింట్ల నష్టంతో 49,099 వద్దకు చేరింది. నిఫ్టీ 568 పాయిట్లు కోల్పోయి 14,529 వద్ద స్థిరపడింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- అచ్చం జడ్డూలానే
టీమ్ఇండియా స్పిన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ తన క్రికెట్ కెరీర్‌పై కీలక వ్యాఖ్యలు చేశాడు. అనుకోకుండా తాను క్రికెటర్ అయినట్లు ఓ ఇంటర్యూలో తెలిపాడు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- సెట్స్ పైకి 'శాకుంతలం'
అగ్రకథానాయిక సమంత ప్రధానపాత్రలో నటించనున్న 'శాకుంతలం' చిత్రీకరణను వచ్చే నెలలో ప్రారంభించనున్నారని సమాచారం. దానికి తగ్గట్టుగా చిత్రబృందం ప్రీ ప్రొడక్షన్ పనులను నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.