ETV Bharat / city

AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 9PM - AP TOP NEWS

.

ఏపీ ప్రధాన వార్తలు
AP TOP NEWS
author img

By

Published : Jun 1, 2022, 9:00 PM IST

  • ఏసీబీ మొబైల్‌ యాప్‌.. ప్రారంభించిన జగన్​
    ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు అవినీతి నిరోధానికి ఏసీబీ మొబైల్‌ యాప్‌ రూపొందించింది. 'ఏసీబీ 14400' పేరుతో రూపొందిన మొబైల్‌ యాప్​ను క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ప్రారంభించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • సార్ట్‌ నిర్మాణానికి మొత్తం కొండ తొలిచేస్తే ఎలా ?: సుప్రీంకోర్టు
    విశాఖ రుషికొండ తవ్వకాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్​పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. వాదనలు విన్న సుప్రీంకోర్టు గతంలో రిసార్ట్‌ ఉన్న ప్రాంతంలోనే నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించింది. అవసరం అనుకుంటే హైకోర్టు మరో కమిటీ నియమించుకోవచ్చని తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • అమలాపురం ఘటనలో 71 మంది అరెస్ట్​
    కోనసీమ జిల్లాకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జిల్లాగా ప్రకటించడాన్ని నిరసిస్తూ.. మే 24న చెలరేగిన హింసాత్మక ఘటనలపై.. పోలీసు దర్యాప్తు వేగంగా సాగుతోంది. నేటి వరకు 71 మంది నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'మా పోరాటానికి చంద్రబాబు మద్దతిచ్చారు'
    తేదేపా కేంద్ర కార్యాలయంలో గ్రూప్-1 అభ్యర్థులు.. చంద్రబాబును కలిశారు. 2018 గ్రూప్-1 పరీక్షా ఫలితాల్లో అనేక అవకతవకలు జరిగాయని ఆరోపించారు. దీనిపై తమ పోరాటానికి నైతిక మద్దతు ఇవ్వటంతో పాటు న్యాయపరంగా సహాయం అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని అభ్యర్థులు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • మహారాష్ట్రలో కరోనా విజృంభణ
    మహారాష్ట్రలో కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగాయి. బుధవారం రికార్డు స్థాయిలో 1,081 కొత్త కేసులు వెలుగుచూశాయి. ముంబయి నిన్న, మొన్నటి వరకు స్థిరంగా ఉన్న కేసులు భారీగా వృద్ధి చెందడం ఆందోళన కల్గిస్తోంది. అయితే.. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • సోనియా, రాహుల్​కు ఈడీ సమన్లు..
    కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి ఈడీ సమన్లు జారీ చేసింది. నేషనల్​ హెరాల్డ్​ వ్యవహారంలో విచారణకు రావాలని బుధవారం నోటీసులు ఇచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఉక్రెయిన్​కు అమెరికా నుంచి హైటెక్​ రాకెట్​ వ్యవస్థలు!
    రష్యా సైనిక చర్యతో ఉక్కిరిబిక్కిరవుతోన్న ఉక్రెయిన్​కు ఆయుధాలు పంపేందుకు అగ్రరాజ్యం సిద్ధమైంది. హైటెక్​, మీడియం రేంజ్​ రాకెట్​ వ్యవస్థలను పంపాలని అమెరికా నిర్ణయించినట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..
    బంగారం, వెండి ధరలు బుధవారం భారీగా తగ్గాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 10 గ్రాముల పసిడి ధర రూ. 52,300గా ఉంది. కిలో వెండి ధర రూ. 63,080గా ఉంది. మరోవైపు మంగళవారం నష్టాల్లో ముగిసిన స్టాక్​ మార్కెట్​ సూచీలు.. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • గంగూలీ సంచలన ప్రకటన..
    భారత క్రికెట్ దిగ్గజం, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్​ గంగూలీ త్వరలోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు దాదా. త్వరలోనే తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • సింగర్​ కేకే మృతిపై రాజకీయ రగడ..
    గాయకుడు కేకే మరణంపై రాజకీయ దుమారం చెలరేగుతోంది. కేకే కచేరీ ఇచ్చిన ఆడిటోరియంలో వసతుల లేమి వల్లే ఆయన మరణించి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో బంగాల్ సర్కారుపై విమర్శలు గుప్పించింది భాజపా. దీనికి టీఎంసీ కౌంటర్ ఇచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.