ఉపాధి హామీ పథకానికి సంబంధించి.. గతంలో విడుదల చేసిన 2 వేల 148 కోట్ల నిధులు జూన్ 2, 2020 వరకు పని చేసిన కూలీల చెల్లింపులకు సరిపోయాయని.. ప్రస్తుతం విడుదల చేసిన రూ.765.85 కోట్ల రూపాయలు ఈ సీజన్లో పని చేసిన కూలీల చెల్లింపులకు సరిపోతాయని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. కరోనా వ్యాధి వ్యాప్తి కారణంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఉపాధి హామీ కూలీలకు ఇది ఎంతో ఊరటనిచ్చిందని తెలిపారు. కరోనాపై కూలీలకు అవగాహన కల్పిస్తూ.. భౌతిక దూరం పాటిస్తూ.. పనులు చేపడుతున్నట్లు మంత్రి వెల్లడించారు. నిధులకు ఎలాంటి కొరత లేనందున నిరాటంకంగా కూలీలకు పనులు ఇవ్వాలని అధికారులను పెద్దిరెడ్డి ఆదేశించారు.
ఇదీ చదవండి: భారత్కు సాయం కోసం.. బుజ్జి ఎన్ఆర్ఐ సాహసం