ETV Bharat / city

ఆ ఐదు జిల్లాల్లో కరోనా విజృంభణ... రికార్డు స్థాయిలో కేసులు నమోదు

author img

By

Published : Jul 21, 2020, 5:04 PM IST

Updated : Jul 21, 2020, 6:19 PM IST

corona cases in ap
corona cases in ap

17:03 July 21

కరోనా వైరస్​కు మరో 62 మంది బలి

undefined

రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకూ నమోదైన కేసుల కంటే అత్యధికంగా 24 గంటల వ్యవధిలో దాదాపు ఐదు వేల మందికి కరోనా పాజిటివ్ సోకినట్టు వైద్యారోగ్యశాఖ తెలియచేసింది. నిన్న ఉదయం 9 గంటల నుంచి ఇవాల్టి ఉదయం 9 గంటల వరకూ 4944 మందికి కరోనా సోకినట్టు ప్రభుత్వం వెల్లడించింది. కరోనా కారణంగా 24 గంటల వ్యవధిలో 62 మంది మృతి చెందినట్టు ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలో కోవిడ్ పాజిటివ్ కేసులతోపాటు కరోనా మరణాలు రికార్డు స్థాయిలో నమోదు కావటం ఆందోళన కలిగిస్తోంది. 

రాష్ట్రంలో కరోనా వైరస్ విలయతాండవం సృష్టిస్తోంది. 24 గంటల వ్యవధిలో కరోనా వైరస్ 4944 మందికి సోకినట్టుగా ప్రభుత్వం తెలియచేసింది. 24 గంటల వ్యవధిలో 37 వేల 162 నిర్ధరణ పరీక్షలు చేస్తే ఇందులో 4944 మందికి కరోనా సోకినట్టు ప్రభుత్వం బులెటిన్​లో పేర్కొంది. పశ్చిమగోదావరి జిల్లాలో అత్యధితంగా 623 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మొత్తం ఐదు జిల్లాల్లో ఐదు వందల కంటే ఎక్కువ మంది కరోనా సోకింది. 

రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 55 వేల 7773కు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్ ఆస్పత్రులు, కేర్ సెంటర్లలో 32 వేల 119 మంది చికిత్స పొందుతుంటే 22 వేల 896 మంది డిశ్చార్జి అయినట్టు ప్రభుత్వం తెలిపింది. 

నిన్న ఉదయం 9 గంటల నుంచి ఇవాల్టి ఉదయం 9 గంటల వరకూ 37 వేల 162 నమూనాలను పరీక్షిస్తే అందులో వీఆర్డీఎల్ ల్యాబ్ లు, ట్రూనాట్ యంత్రాల ద్వారా 20 వేల 552 మందికి, ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షల ద్వారా 16, 610 మందికి పరీక్షలు చేశారు. ఇక ఇప్పటి వరకూ రాష్ట్రంలో నిర్వహించిన పరీక్షల సంఖ్య 13 లక్షల 86 వేల 274కు చేరినట్టు ప్రభుత్వం బులెటిన్ లో స్పష్టం చేసింది.

జిల్లా

నమోదైన కేసులు

పశ్చిమ గోదావరి 623
గుంటూరు577
చిత్తూరు560
తూర్పు గోదావరి 524
కర్నూలు515
అనంతపురం458
కృష్ణా424
కడప322
విశాఖ230
విజయనగరం210
నెల్లూరు197
ప్రకాశం171
శ్రీకాకుళం133

24 గంటల వ్యవధిలోనే రాష్ట్రవ్యాప్తంగా 52 మంది కరోనా కారణంగా మృతి చెందారు. తూర్పుగోదావరిలో 10 మంది , విశాఖలో 9, చిత్తూరులో 8, శ్రీకాకుళంలో 7, అనంతపురంలో 6, పశ్చిమగోదావరి 6, గుంటూరు 5, ప్రకాశంలో 5, కర్నూలులో 4, కడప, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందినట్టు ప్రభుత్వం తెలిపింది. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 758 కి పెరిగింది. 
 
ఇదీ చదవండి: పోలీస్​ స్టేషన్​లోనే ఎస్సీ యువకుడికి గుండు గీసిన పోలీసులు

Last Updated : Jul 21, 2020, 6:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.