కరోనా ఉద్ధతి రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా 1,05,494 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేయగా 22,164మందికి వైరస్ సోకినట్టుగా వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. దీంతో ఏపీలో మెుత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 12 లక్షల 87వేల 603కు చేరింది. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 2844, చిత్తూరు-2169, గుంటూరు-2099, నెల్లూరు-1574 , కర్నూలు-1568, కృష్ణా-1240, విశాఖ-2206, శ్రీకాకుళం-1432, అనంతపురం-2039, కడప-1267, ప్రకాశం -980, విజయనగరం-998, పశ్చిమ గోదావరి జిల్లాలో 1748 కేసులు నమోదు అయినట్లుగా వైద్యారోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,90,632 యాక్టివ్ కేసులు ఉన్నట్లు పేర్కొంది. గడిచిన 24 గంటల్లో 18,832 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్ఛార్జి అయ్యారని అధికారులు తెలిపారు. కొవిడ్ కారణంగా 24 గంటల వ్యవధిలో 92 మంది మృతి చెందారు. దీంతో ఏపీలో కరోనా మృతుల సంఖ్య ఇప్పటికి 8,519కి పెరిగింది.
ఇదీ చదవండి: