హైదరాబాద్లో జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ పక్కనే ఉన్న ప్రహారీ గోడ కూలి 20వాహనాలు ధ్వంసమయ్యాయి. ప్రహరీ గోడకు మరమ్మతు పనులు చేపడుతుండగా ఒకేసారి గోడ కూలి ఠాణా పార్కింగ్ స్థలంలో ఉంచిన వాహనాలపై పడింది. పోలీసు స్టేషన్ పార్కింగ్ స్థలంలో వివిధ కేసుల్లో తీసుకు వచ్చిన 18 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలను ఉంచారు.
ఈ క్రమంలో పార్కింగ్ స్థలం పక్కనే ఉన్న ఓ వ్యక్తి తన ఇంటి ప్రహరీగోడకు మరమ్మతు పనులు చేపట్టారు. ఆ సమయంలో అకస్మాత్తుగా గోడ కూలి వాహనాలపై పడింది. ఘటనపై సమాచారం అందుకున్న బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్.. ఠాణాను సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఇదీ చదవండి: