- CM Jagan Birthday Celebrations: క్యాంపు కార్యాలయంలో సీఎం పుట్టినరోజు వేడుకలు
CM Jagan Birthday Celebrations: ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి శ్రీవారి ప్రసాదాన్ని తితిదే ఈవో జవహర్ రెడ్డి అందించారు. పండితులు వేదాశీర్వచనం అందించి అక్షితలు చల్లారు.
- TDP Somireddy on Sand Mining: సీఎం జగన్ ఉచిత ఇసుక విధానాన్ని ప్రకటించాలి: సోమిరెడ్డి
Former minister Somireddy alleged Scam in sand mining: తన పుట్టినరోజు సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ ఉచిత ఇసుక విధానాన్ని ప్రకటించాలని తెలుగుదేశం నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కోరారు. రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక అక్రమాలపై ఆయన విమర్శలు చేశారు. వేల కోట్ల రూపాయలు వైకాపా నాయకులు స్వాహా చేస్తున్నారని సోమిరెడ్డి ఆరోపించారు.
- Amul Milk To Anganwadies: అంగన్వాడీ కేంద్రాలకు తాజా అమూల్ పాలు
Anganwadi Centres: అంగన్వాడీ కేంద్రాలకు అమూలు పాలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వీటిని టెట్రా ప్యాకెట్ల ద్వారా కాకుండా తాజాగా అందించాలని నిర్ణయం తీసుకుంది.
- Debt of Telangana: రూ. 2 లక్షల కోట్లు దాటిన తెలంగాణ అప్పు
Debt of Telangana 2021: ఈ ఏడాది నవంబర్ నాటికి తెలంగాణ రాష్ట్రం రూ.2,37,747 కోట్ల అప్పు చేసిందని కేంద్ర ఆర్థిక శాఖ లోక్‌సభకు తెలిపింది. దేశీయ అప్పుగా రూ.2,34,912 కోట్లు అప్పు చేయగా.. రూ.2,835 కోట్లు విదేశీ అప్పు చేసిందని వెల్లడించింది.
- డ్రగ్స్‌కు బానిసై.. 12 వాహనాలను ధ్వంసం చేసిన యువకుడు
డ్రగ్స్‌కు బానిసైన ఓ యువకుడు కేరళ బలరాంపురలోని పలు వాహనాలను ధ్వంసం చేశాడు. పార్కింగ్‌లో ఉన్న సుమారు 12 వాహనాల అద్దలను పగలకొట్టాడు. అతనితో పాటు మరో యువకుడు కూడా ఉన్నాడు.
- Omicron Cases in India: దేశంలో 200 దాటిన ఒమిక్రాన్ కేసులు
Omicron Cases in India: దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 200 దాటింది. ఈ విషయాన్ని కేంద్రం వెల్లడించింది. ఒమిక్రాన్ బాధితుల్లో ఇప్పటివరకు 77 మంది డిశ్చార్జ్ అయినట్లు పేర్కొంది.
- ఇళ్లల్లోకి దూరిన ఎలుగుబంట్లు.. ప్రజల్లో భయాందోళనలు
ఒడిశా మల్కాన్‌గిరి జిల్లాలో అడవులకు సమీపంలో ఉన్న గ్రామాల్లో.. వన్యప్రాణులు స్థానికులను బెంబేలెత్తిస్తున్నాయి. తరచూ ఏనుగుల గుంపు గ్రామాల్లోకి రావడం సహజం కాగా ఇప్పుడు ఎలుగుబంట్లు కూడా వస్తున్నాయి. ఆయా గ్రామాల ప్రజలకు కునుకులేకుండా చేస్తున్నాయి.
- వైట్‌హౌస్ ఉద్యోగికి కరోనా.. 3 రోజుల క్రితమే బైడెన్‌తో కలిసి...
White House covid: శ్వేతసౌధంలో పనిచేసే ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. ఆ ఉద్యోగి మూడు రోజుల క్రితమే బైడెన్‌తో కలిసి ప్రయాణించినట్లు శ్వేతసౌధ అధికార ప్రతినిధి వెల్లడించారు. దీంతో అప్రమత్తమై అధ్యక్షుడికి పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు.