AP Liquor Policy: ఇంతకాలం మందుబాబుల అఘాయిత్యాలను భరిస్తూ వచ్చారు ఆ ప్రాంతంలోని ప్రజలు. ఇక ఓపిక నశించిన ఆ ప్రాంతంలోని మహిళలు.. తమ గ్రామంలో మద్యం దుకాణం వద్దంటూ నిరసన చేపట్టారు. తిరుపతి జిల్లా కె.వి.బి.పురం మండలం రాగిగుంటలో రోడ్డుపైకి వచ్చి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రాగిగుంటలో మద్యం దుకాణం తొలగించాలంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్ల మధ్యలో మద్యం దుకాణం వల్ల ఇబ్బంది పడుతున్నామని పేర్కొన్నారు. పిల్లలు పాఠశాలలకు వెళ్లేటప్పుడు, రాత్రి సమయాల్లో మందుబాబుల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని వాపోయారు. వైన్‌షాప్ తొలగించకుంటే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇవీ చదవండి: