వైకాపా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు జాతీయ స్థాయిలో తెలిసేలా తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో విజయం సాధిస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. తిరుపతిలో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలతో ఆయన ఎన్నికల సన్నద్ధతపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఉపఎన్నికలో.. పురపాలక, పంచాయతీ ఎన్నికల తరహాలోనే విజయం సాధిస్తామని మంత్రి పెద్దిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాల అమలుతో ప్రజలు సంతృప్తిగా ఉన్నారని తెలిపారు. తిరుపతి ఫలితం జాతీయ స్థాయిలో గుర్తింపు తెస్తుందన్నారు.
రెస్కో స్వయం ప్రతిపత్తితోనే నడుస్తుంది
కుప్పం రూరల్ ఎలక్ట్రిక్ కోఆపరేటివ్ సొసైటీ (రెస్కో) ఇకపైనా స్వయం ప్రతిపత్తితోనే నడుస్తుందని.. ప్రభుత్వం నుంచి ఆ మేరకు ఆదేశాలు జారీ చేస్తామని మంత్రి తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ.. ఎస్పీడీసీఎల్‌లో విలీనం కానివ్వమని.. దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. రెస్కోపై తెదేపా నాయకులు కావాలనే రాద్దాంతం చేస్తున్నారన్నారు.
ఇదీ చదవండి: