ETV Bharat / city

'రామమందిర భూమిపూజ ఎస్​వీబీసీ ఎందుకు ప్రసారం చేయలేదు' - ఎస్వీబీసీపై విష్ణు వర్థన్ రెడ్డి

అయోధ్య రామమందిర భూమిపూజ ప్రత్యక్ష ప్రసారాన్ని ఎస్​వీబీసీలో ఎందుకు ప్రసారం చేయలేదని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి నిలదీశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్​వీబీసీ సీఈఓ వెంకట నాగేష్​ను విధుల నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు

Vishnuvardhanreddy On SVBC
భాజపా రాష్ట్ర ఉపాVishnuvardhanreddy On SVBCధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి
author img

By

Published : Aug 6, 2020, 12:42 PM IST

అయోధ్య రామమందిర భూమిపూజ ప్రత్యక్ష ప్రసారాన్ని ప్రపంచంలో 250 టీవీ ఛానళ్లు గంటలపాటు ఇస్తే.. ఎస్​వీబీసీలో ఎందుకు ప్రసారం చేయలేదని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. హిందువుల మనోభావాలు తితిదే ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్​వీబీసీ దెబ్బతీస్తోందని ఆరోపించారు. సీఎం జగన్ వెళ్లిన శారదాపీఠం విశాఖలో ప్రత్యక్ష ప్రసారాలు చేసిన తితిదే అయోధ్య ప్రసారాలు ఎందుకు చేయలేదని నిలదీశారు.

ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్​వీబీసీ సీఈఓ వెంకట నాగేష్​ను విధుల నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. సీఎం జగన్ , దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, తితిదే ఛైర్మన్‌ సుబ్బారెడ్డి స్పందించాలని కోరారు.

ఇదీ చదవండి: అమరావతి బృహత్​ ప్రణాళికపై సుప్రీంకోర్టు విచారణ వాయిదా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.