ద్వాదశిని పురస్కరించుకుని తిరుమలలో చక్రస్నానం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. చక్రతాళ్వారును ఆలయం నుంచి పల్లకీలో ఊరేగింపుగా.. వరాహపుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. పాలు, పెరుగు, కొబ్బరినీరు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు చేశారు. అనంతరం శ్రీవారి పుష్కరిణిలో సుదర్శన చక్రతాళ్వార్లకు.. పుష్కరస్నానం చేయించారు.
శ్రీనివాసుడి సేవలో న్యాయమూర్తులు:
తిరుమల శ్రీవారిని పలువురు న్యాయమూర్తులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఇందిరా బెనర్జీ, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుర్గాప్రసాద్‌రావు.. స్వామివారిని దర్శించుకున్నారు. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అమర్నాథ్‌గౌడ్, పట్నా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నరసింహారెడ్డి స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం ఆలయ సిబ్బంది.. స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
ఇదీ చదవండి: బుక్ చేసుకున్న బస్ మిస్సయితే తర్వాత వచ్చే సర్వీస్‌లో వెళ్లొచ్చు