తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో.. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రితురాజ్ అవస్థి, రాష్ట్ర మంత్రి గుమ్మానూరు జయరామ్, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్, తెలంగాణ ఎమ్మెల్సీ విఠల్ దండే, ఎమ్మెల్యే గాంధీ.. వెంకటేశ్వర స్వామివారి సేవలో పాల్గొన్నారు.
ప్రముఖులకు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసిన అధికారులు... దర్శనానంతరం తీర్థప్రసాదాలు అందజేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి మహాద్వారం వద్ద స్వాగతం పలికిన అదనపు ఈవో ధర్మారెడ్డి.. రంగనాయకుల మండపంలో తీర్థప్రసాదాలు అందజేశాక శేషవస్త్రంతో సత్కరించారు. అనంతరం శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని హైకోర్టు సీజే ప్రశాంత్ కుమార్ మిశ్రా సందర్శించారు. రాహు, కేతు సర్ప దోష నివారణ పూజలు చేయించారు.
ఇదీ చదవండి: శ్రీవారి భక్తులకు అసౌకర్యం కలగకుండా పటిష్ట చర్యలు: తితిదే అదనపు ఈవో