తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం హైకోర్టు సీజే జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా దర్శించుకున్నారు. ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు వాసుబాబు, కోలగట్ల వీరభద్రస్వామి, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్సీలు రఘురాజు, రామారావు, తెలంగాణ ఎమ్మెల్యేలు బేతి సుభాష్ రెడ్డి, సంద్ర వెంకట వీరయ్య, భాజపా నేత విష్ణువర్ధన్ రెడ్డి స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు.
విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రోజు రోజుకూ దిగజారుతోందన్నారు. భాజపా, జనసేన పోత్తుతో ఎన్నికలకు వెళ్లేలా పవన్ కల్యాణ్ నుంచి సంకేతాలు వస్తున్నట్లు తెలిపారు.
'హీరో' చిత్ర కథానాయకుడు అశోక్ గల్లా, నటి నిధి అగర్వాల్, దర్శకుడు శ్రీరామ్ అదిత్య, ఎంపీ గల్లా జయదేవ్ శ్రీవారి సేవలో పాల్గొన్నారు.
శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.50 కోట్లు
శ్రీవారిని మంగళవారం 23,744 మంది భక్తులు దర్శించుకున్నారు. 12,017 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీకి రూ.2.50 కోట్ల ఆదాయం సమకూరింది.
ఇదీ చదవండి: